Afghanistan Earthquake 2023: ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని భారీ భూకంపం కకావికలం చేసింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైన భూకంపంతో చాలావరకూ భవనాలు నేలకూలాయి. వందలాది మంది శిధిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని సమాచారం.
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. హెరాత్ ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతో వచ్చిన భూకంపానికి ముందు వెనుక ఐదు సార్లు భూమి భారీగా కంపించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం దేశంలోని అతిపెద్ద నగరం హెరాత్‌కు వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై వరుసగా 5.5, 4.7. 6.3, 5.9, 4.6 తీవ్రత నమోదైంది. ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం ధాటికి గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకూ 15 మంది మరణించినట్టు సమాచారం. కానీ మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా.
దాదాపు గంటసేపు భూమి కంపించడంతో హెరాత్ పట్టణం రోడ్లపైకి ప్రజలు భయంతో పరుగులు తీశారు. వందలాది మంది మరణించి ఉండవచ్చని ప్రాధమిక సమాచారం. గత ఏడాది ఆప్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతో భూమి కంపించినప్పుడు 1000 మందికి పైగా మరణించారు. ఈసారి తీవ్రత ఇంకాస్త ఎక్కువగా ఉంది. హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భూమి అడుగుల యురేషియన్ టెక్టానిక్ ప్లేట్, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో భూమి తరచూ కంపిస్తోంది.
ఈ భూకంపంపై అక్కడి తాలిబన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఎంతమంది మరణించారు, ప్రాణ, ఆస్థినష్టం వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో టెలీఫోన్ కనెక్షన్లు కూడా తెగిపోవడంతో పరిస్థితి అంచనా వేయడం కష్టంగా ఉంది.
Also read: Mission Gaganyaan: మిషన్ గగన్ యాన్‌లో కీలక పరీక్షఅబార్ట్ మిషన్ పరీక్ష త్వరలోనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook