Tholi Ekadasi 2023: తొలి ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు.. ఎందుకంటే ఈరోజు 5 ఆరుదైన యోగాలు కలుస్తాయి. అంతేకాకుండా ఈరోజు శ్రీమహావిష్ణువును పూజించే ఉపవాసాలు పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా సులభంగా నశిస్తాయి. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశిని ఆషాడ శుక్లపక్షంలోని వస్తుంది. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూన్ 29వ తేదీ గురువారం (ఈ రోజు) వచ్చింది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈరోజును చతుర్మాసమని కూడా అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువు ఏయే నియమాలతో పూజించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయే చతుర్మాస ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ఏకాదశి శుభ సమయాలు:
✴ తొలి ఏకాదశి శుభ ముహూర్తం: జూన్ 29 నుంచి 03.18 ఉదయం
✴ ఆషాడ శుక్ల తొలి ఏకాదశి ప్రారంభ సమయం: జూన్ 30 నుంచి 02.42 ఉదయం
✴ ఆషాడ శుక్ల తొలి ఏకాదశి ముగింపు సమయం:01.48 మధ్యాహ్నం 04.36 సాయంత్రం వరకు..
✴ తొలి ఏకాదశి ఉపవాస సమయం: 01.48 మధ్యాహ్నం నుంచి సాయంత్రం 04.36 సాయంత్రం
✴ పూజా ప్రత్యేక సమయం: ఉదయం 10.49 నుంచి మధ్యాహ్నం 12.25 వరకు
తొలి ఏకాదశి శుభ యోగం:
ఈ సంవత్సరంతొలి ఏకాదశి రోజు గ్రహాలు, రాశుల అనుకూల స్థానం కారణంగా..6 శుభ యోగాలు ఏర్పాడతాయి. ఈ రోజు స్థిర, సిద్ధి, బుధాదిత్య, గజకేసరి, రవి యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఈ రోజు తొలి ఏకాదశి ప్రాముఖ్య పెరిగింది. ఈ శుభ యోగాల కలయిక కారణంగా ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించడం వల్ల రెట్టింపు ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
తొలి ఏకాదశి పూజ నియమాలు:
✺ తొలి ఏకాదశి సూర్యోదయానికి ముందే స్నానం చేయాల్సి ఉంటుంది.
✺ ఆ తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి.
✺ భక్తి శ్రద్ధలతో శ్రీ హరి విష్ణు, మహాలక్ష్మి దేవిలకు శంఖంలో పాలు పోసి అభిషేకం చేయాల్సి ఉంటుంది.
✺ విష్ణువుకు పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పసుపు పండ్లు, చందనం, అక్షత, తమలపాకులు సమర్పించాల్సి ఉంటుంది.
✺ స్వామివారికి చక్కెరతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి..ధూపం, దీపం వెలిగించి ఓం భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది.
✺ ఆ తర్వాత విష్ణువు, లక్ష్మిదేవతల కథను విని, విష్ణు సహస్రనామం పారాయణం చేయాల్సి ఉంటుంది.
✺ ఇలా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత నిరు పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులను దానం చేయాలి.
✺ ఆ తర్వాత భక్తితో ద్వాదశి తిథిలో శుభ సమయంలో ఉపవాసం పాటించాలి.
ఈ మంత్రం జపించండి:
సుప్తే త్వతి జగన్నాథ్ జగత్ సుప్తం భవేదిదమ్ ॥
విబుద్ధే త్వయి బుధ్యేత్ జగత్ సర్వం చరాచరమ్॥
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి