King Cobra's Becomes Angry on Snake Catcher: వాతావరణం మారినప్పుడే పాములు బయటికొస్తుంటాయి. భగభగ మండే ఎండా కాలం కావచ్చు లేదా చల్లటి వాతావరణం కావచ్చు.. పాములు స్వేచ్ఛగా వచ్చి బయట తిరుగుతుంటాయి. అదే సమయంలో ఆ పాములకు తోడు దొరికిందంటే... సరస సల్లాపంలో మునిగి తేలుతుంటాయి. ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రెండు పెద్ద పెద్ద నాగు పాములు ఒకదానినొకటి పెనవేసుకుని రొమాన్స్ చేసుకుంటూ వెళ్లి ఒక ఇంట్లోని పైకప్పు రేకుల కిందకు దూరాయి.
ఆ పాములు రెండూ పైకి ఎగబాకుతూ రేకుల కిందకు వెళ్లడం చూసిన స్థానికులు స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. స్థానికుల అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. అతి కష్టం మీద ఆ పాములను బయటికి తీశాడు. ఆ పాములను వెలికి తీసే క్రమంలో స్నేక్ క్యాచర్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. దాదాపు ప్రాణాలకు తెగించి పెద్ద సాహసమే చేశాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే ఆ పాములు ఎక్కడ దాక్కున్నాయో గుర్తించిన ఆ యువకుడు.. అతి జాగ్రత్తగా ఒక్కో ఇటుక పెళ్ల తొలగిస్తూ వాటి ఆచూకీని కనిపెట్టాడు. ఒక్క పామును చూస్తేనే ప్యాంట్ తడిపేసుకునే వాళ్లుంటారు.. కానీ ఈ స్నేక్ క్యాచర్ మాత్రం ఒకే చోట రెండు పాములు ఉన్నప్పటికీ.. వాటిని చూసి ఏ మాత్రం భయపడకుండా వాటి తోక పట్టుకుని బయటికి లాగాడు. తోక పట్టుకుని బయటికి లాగడంతోనే తమకు ఏదో ప్రాణ హానీ పొంచి ఉందని గ్రహించిన నాగు పాము.. శత్రువుపైకి బుసలు కొడుతూ కోరలు చాచింది. ఆ క్రమంలో శత్రువును కాటేస్తున్నాను అని అనుకుని తనకే తెలియకుండా తన శరీరాన్నే తనే కాటేసుకోవడం మొదలుపెట్టింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. గూస్‌బంప్స్ తెప్పించే ఈ వైరల్ స్నేక్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ఇది కూడా చదవండి: Dangerous King Cobra: ముసలోడే కానీ.. మహానుభావుడు.. 16 అడుగుల కింగ్ కోబ్రాను సింపుల్ గా పట్టేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook