Firing In Texas: విషాదం.. టెక్సాస్ కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. ఒక సంస్థలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ గా విధులు నిర్వహిస్తున్న తాటికొండ ఐశ్వర్య అనే యువతీ కూడా మృతి చెందింది. ఆమె మృతి తో స్థానికంగా విషాదం నెలకొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2023, 07:37 PM IST
Firing In Texas: విషాదం.. టెక్సాస్ కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి

Firing In Texas: అమెరికాలో మరోసారి దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం 9 మంది మృతి చెందారు. అందులో ఒక తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్య కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కూతురు ఐశ్వర్య టెక్సాస్ లోని ఒక సంస్థలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె మృతి తో స్థానికంగా విషాదం నెలకొంది. 

ఆమె మృతదేహంను రేపటి వరకు హైదరాబాద్ కు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. మరణవార్త ను ఆమె స్నేహితురాలు నిర్థారించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగి పోయారు.

ఉత్తర డల్లాస్ లోని ఓ ఔట్ లెట్ మాల్ లోకి వాహనంలో దూసుకు వచ్చిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో వందల కొద్ది మంది ఉన్న మాల్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. దుండగుడు విచక్షణరహితంగా కాల్పులకు దిగడంతో మొత్తం 9 మంది మృతి చెందగా.. పలువురు గాయాల పాలయ్యారు. బాధితుల్లో కొంత మంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. 

దాడి జరిగిన వెంటనే దుండగుణ్ని గుర్తించిన పోలీసులు కాల్చి చంపారు. ఉత్తర డల్లాస్ కి 40 కిలోమీటర్ల దూరంలోని స్ప్రాలింగ్ షాంపింగ్ కాంప్లెక్స్ లో ఈ దారుణం జరిగింది. కాల్పుల సమయంలో మాల్ లో ఉన్న వారు పరుగులు తీయడం వల్ల తొక్కీసలాట జరిగింది. ఆ సమయంలో కొందరు గాయాల పాలయ్యారు. 

Also Read: Vijay Deverakonda Birthday Special:విజయ్ దేవరకొండకు అవార్డ్ అమ్మేంత అవసరం ఏమొచ్చింది

టెక్సాస్ లో జరిగిన సంఘటనతో హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. దుండగుడి మానసిక పరిస్థితి బాగాలేనట్లుగా వ్యవహరించడంతో పాటు ఇష్టానుసారంగా కాల్పులు జరపడం వల్ల పెద్దవారితో పాటు పిల్లలు కూడా మృతి చెందినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. 

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగడం విషాదం. ఐశ్వర్య మృతితో అమెరికాలో పిల్లలు ఉండి ఇండియాలో ఉంటున్న పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రత పట్ల వారు ఆందోళనగా ఉన్నారు.

Also Read: TS Inter Results 2023 Live Updates: 2023 తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News