Rain Alert In AP: గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాల ప్రభావం పెరుగుతూనే ఉంది అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఐఎండీ మరో హెచ్చరిక చేస్తుంది. మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రధానంగా కొన్ని జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండి హెచ్చరించింది. నాగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఎల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా ప్రయాణిస్తుంది.
అయితే ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. 27వ తేదీ వరకు శ్రీలంక ఉత్తర దిశగా వస్తుందని అంచనా వేశారు. ఈ ప్రభావం ఏపీలోని నెల్లూరు ప్రకాశం కోస్తా, రాయలసీమలోని అన్ని ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండి.
గత కొద్ది రోజులుగా అల్పపీడనంలో ప్రభావంతో రాయలసీమ కోస్తావంటి ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరులో అధిక వర్షపాతం నమోదైంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అలర్ట్ చేశారు. ఈ రెండు రోజులు కూడా చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో కూడా వాతావరణం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి సమయంలో చలి బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అవుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల మరింత చలి నమోదు అయ్యే అవకాశం ఉంది.