నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తదితరులు...
ఎడిటింగ్: రామ్ తూము
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకత్వం: ఆద్యంత్ హర్ష
రీసెంట్ గా ‘నిందా’ మూవీతో అలరించిన వరుణ్ సందేశ్.. తాజాగా ‘విరాజి’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్టు ‘విరాజి’ మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
‘విరాజి’ కథ విషయానికొస్తే.. ఒక ఊరికి చివర్లో పాపాడుపడిన ఇంట్లో సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు ఓ ప్రోగ్రామ్ కోసం కోసం అక్కడి వస్తారు. అక్కడికి వచ్చిన వారందరు తిరిగి బయటకు వెళ్లలేక ఇరుక్కుపోతారు. అంతేకాదు వారందరు ఆ రోజు రాత్రే చనిపోతారని ఆ లెటర్ లో ఉంటుంది. అసలు ఆ పాడుపడిన ఇంటికి వచ్చిన వారు చేసిన ఆ తప్పేమేమిటి.. ? వారందరు అక్కడికి రావడానికి ఎవరు మోటివ్ చేసారు ? చివరకు ఇంట్లో వచ్చిన వాళ్లు చివరిక బతికి బయటపడ్డారా.. ఇంతకీ ‘విరాజి’ ఎవరు..? వీళ్లకు అతనికి సంబంధం ఏమిటి అనేదే ఈ మూవీ కథ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
‘విరాజి’ అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. అంతేకాదు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు దర్శకుడు. అంతేకాదు ఈ సినిమాకు మోటివ్ కూడా అదే. సినిమా ఫస్టాఫ్ లో ఒక్కొక్కరుగా ఊరికి దూరంగా ఉన్న పాడుపడిన బంగ్లాలో ఇరుక్కుపోవడం.. ఈ క్రమంలో ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసే వ్యక్తి అక్కడికి వచ్చిన వారందరికీ వాళ్లు చేసిన తప్పులను చెబుతాడు. అంతేకాదు వారంత ఆ రోజు రాత్రే చనిపోతారని చెప్పడం వరకు బాగానే ఉంది. ఈ క్రమంలో ఈ ఇంట్లోకి వచ్చిన వారు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. చివరకు ఏం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక అంశాన్ని పట్టుకొని.. ఈ సినిమాకు కనెక్ట్ చేసాడు. అక్కడక్కడ మనకు లాజిక్ లు మిస్ అయినా.. చివరకు తాను చెప్పాలనుకున్న అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. కొత్త దర్శకుడు అయినా.. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఇంకాస్త ఎఫెక్ట్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు అంతా బాగానే ఉన్నా.. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో తడబడ్డాడు. ఓవరాల్ గా ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా దాదాపు మొత్తం ఓ రూమ్ లో చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్ లో ఫోటోగ్రఫీ బాగుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఎడిటర్ తన కత్తెరకు బాగానే పని చెప్పినా.. ప్రీ క్లైమాక్స్ కాస్త సాగతీతగా అనిపించింది.
నటీనటుల విషయానికొస్తే..
వరుణ్ సందేశ్ విరాజిగా, రిచర్డ్ ఆండీగా తన పాత్రకు న్యాయం చేసాడు. తలకు డిఫరెంట్ రంగుతో ఇంగ్లీష్ యాక్సెంట్ లో యాక్ట్ చేశాడు. ఇక సెలబ్రిటీ అస్ట్రాలజర్ పాత్రలో రఘు కారుమంచి పాత్ర ఆకట్టుకుంటుంది. ప్రమోదిని తన పరిధి మేరకు రాణించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
సినిమా నడివి
ఇంటర్వెల్ బ్యాంక్
ఆర్ఆర్
మైనస్ పాయింట్స్
ప్రీ క్లైమాక్స్
లాజిక్ లేని సీన్స్
రేటింగ్:2.75/5
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter