The Devils Chair Pre Release Event: టాలీవుడ్ సహా అన్ని లాంగ్వేజెస్ లో గత కొన్నాళ్లులుగా హార్రర్ సస్సెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ జానర్ లో కాస్త అటు ఇటుగా ఉన్న ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ కోవలో వస్తోన్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డెవిల్స్ చైర్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ తో పాటు మాజీ మినిష్టర్ గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఇయర్స్ అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు ఆనందపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదన్నారు. నేను ఈ 23 ఇయర్స్ కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతాను.. సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ శుక్రవారం ‘ది డెవిల్స్ చైర్’ మూవీతో రాబోతున్నాము. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉందన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. ‘‘ది డెవిల్స్ చైర్’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోందన్నారు. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది. ఈ చిత్రం కోసం అభి చాలా కష్టపడ్డ విషయాన్ని ప్రస్తావించారు. నిర్మాతల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది.
గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘నేను కళాకారుడిని కాదు. కానీ కళా హృదయం కలవాడ్ని. సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. ఈ డెవిల్ చైర్ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగింది. అభి అద్భుతంగా నటిస్తాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మగధీర టైం నుంచి అభితో నా జర్నీ స్టార్ట్ అయింది. నా కెరీర్ ఆరంభంలో అభి నన్ను ఎంకరేజ్ చేశాడు. అభి చాలా మంచి వ్యక్తి. ఇలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందన్నారు. .ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాన్నారు.
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ చిత్రంలో ఎలాంటి పాటలు రాయలేదు. అయినా ఈ ఈవెంట్‌కు పిలిస్తే వచ్చాను. దానికి కారణం అదిరే అభి. అతను చాలా మల్టీ టాలెంట్. అభినయ కృష్ణ అని సినారే పేరు పెట్టారు. అదిరే అభిగా జబర్దస్త్ షోతో నవ్వించాడు. ఎంతో క్రమశిక్షణతో ఆయన ఉంటారు. ఆర్టిస్ట్, హీరోగా, డైరెక్టర్‌గా అభి అందరినీ అలరిస్తున్నారు. ఇంతలా కష్టపడే వ్యక్తికి అద్భుతమైన విజయం దక్కాలన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ తమ్మారెడ్డి భరద్వాజ.. వీర శంకర్ తో పాటు సినిమా నటీనటులు నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ కావాలని కోరారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.