మూవీ: ‘హత్య’ (Hathya)
నటీనటులు: రవివర్మ, ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్ తదితరులు..
ఎడిటింగ్: అనిల్ కుమార్.పి
సినిమాటోగ్రఫీ: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్
సంగీతం: నరేష్ కుమారన్.పి,
బ్యానర్: మహాకాళ్ పిక్చర్స్
నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి
రచన, దర్శకత్వం: శ్రీవిద్య బసవ
రన్ టైమ్ : 2 Hr 43 Minits
విడుదల తేది : 24-1-2025
ఆ మధ్య ‘మధ’ అంటూ తెలుగులో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమాను మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
స్టేట్ ఛీప్ మినిష్టర్ కిరణ్ (భరత్ ) తన చిన్నాన్న జేసీ ధర్మేంద్ర రెడ్డి (రవివర్మ)ని నరికి చంపుతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ కేసును నిజాయితీ ల ఐపీఎస్ అధికారి సుధ (ధన్య బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. మరి జేసీ ధర్మేంద్ర రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు ? దీని వెనక ఉన్న మోటివ్ ఏమిటి.. ? ఐపీఎస్ అధికారి సుధ ఈ కేసు చేధించే క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర రెడ్డి మర్డర్ రాజకీయ ప్రేరేపితమా.. ? ఆర్ధిక లావాదేవీలు. కారణమా..? ఫ్యామిలీలో అంత: కలహాల వల్ల జరిగిందా ? అసలు అతన్ని మర్డర్ ఎందుకు అయ్యాడు. దీన్ని ఐపీఎస్ ఆఫీసర్ ఎలా డీల్ చేసిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానానికొస్తే..
ఓ ముఖ్యమంత్రి బంధువు చిన్నాన్న హత్య కు గురి కావడం.. అందరితో సఖ్యంగా మెలిగే అతన్ని ఎందుకు చంపబడ్డాడు. దీని వెనక ఉన్న మోటివ్ నేపథ్యంలోనే దర్శకురాలు శ్రీవిద్య బసవ ఆసక్తిరకంగా మలిచారు. ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం జగన్.. ఆయన చిన్నాన్న వైయస్ వివేకా రెడ్డి హత్యకు సంబంధించిన స్టోరీలా కనిపిస్తోంది. మొత్తంగా కల్పిత గాథ అంటూ అసలు స్టోరీనే తనదైన శైలిలో తెరపై మెప్పించే ప్రయత్నం చేసింది దర్శకుడు శ్రీవిద్య బసవ. అంతేకాదు మనకు తెలిసిన స్టోరీ అయినా.. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు దర్శకురాలు. కథనం కాస్త వీక్ అనిపించినా.. తనదైన శైలిలో ఓ మర్డర్ స్టోరీ బయట చెప్పుకున్నట్టుగానే తెరకెక్కించిందా.. లేకపోతే ఊహాజనితమా అని చెప్పడం కష్టమే. కానీ దర్శకురాలు ఈ సినిమా ఉన్నంతలో ఎంగేజ్ చేసేలా తెరపై చూపించడం మాత్రం ఆసక్తి రేకిస్తోంది. దర్శకురాలు నటీనటులతో మంచి నటన రాబట్టుకొంది. కీలక సన్నివేశాల్లో ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయింది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయి. నరేష్ కుమారన్ ఆర్ఆర్ బాగుంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ లో తన కత్తెరకు కాస్త పదను పెట్టుంటే బాగుండేది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
నటీనటుల విషయానికొస్తే..
రవి వర్మ జేసీ ధర్మేంద్ర రెడ్డి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ముఖ్యమంత్రి పాత్రలో భరత్, ఐపీఎస్ అధికారిణి పాత్రలో ధన్య బాలకృష్ణ తన నటనతో మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘హత్య’.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే మిస్టరీ డ్రామా..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.