Hey Chikitha:‘గరుడ వేగ’ అంజి నిర్మాణంలో ‘హే చికిత’ మూవీ షూటింగ్ ప్రారంభం..

Hey Chikitha: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ ,'గరుడవేగ' అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హే చికితా’ ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 14, 2025, 07:15 PM IST
Hey Chikitha:‘గరుడ వేగ’ అంజి నిర్మాణంలో ‘హే చికిత’ మూవీ షూటింగ్ ప్రారంభం..

Hey Chikitha: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్ల పై ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , 'గరుడవేగ' అంజి సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం "హే చికితా”. యంగ్ డైరెక్టర్ ధన్‌రాజ్  లెక్కల, కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. అతను ఈ సినిమాతోనే మెగా ఫోన్ పట్టుకొని చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం లో వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి లీడ్ రూల్స్  పోషిస్తున్నారు. ఇతర ముఖ్యమైన క్యారెక్టర్ లో మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ నటిస్తుండట విశేషం.  

ఈ మూవీ టైటిల్ ని దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అందరికీ వాలెంటైన్స్ డే విషెష్ తెలుపుతూ ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు.  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని  పలు అద్భుతమైన లొకేషన్ లో ఈ సినిమా షూటింగ్   శర వేగంగా జరుపుకోనుంది.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీతాని అందిస్తున్నారు.  ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా 'గరుడవేగ' అంజి పని చేస్తున్నారు. మధు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిందర్ బెక్కం వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత,  సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి, మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News