Naa Love Story: డైరెక్టర్ అజయ్ భూపతి విడుదల చేసిన ‘నా లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్..

Naa Love Story: మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ల పై  దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. తాజాగా ఈ సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్ ను "ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్  అజయ్ భూపతి లాంచ్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 14, 2025, 07:16 PM IST
Naa Love Story: డైరెక్టర్ అజయ్ భూపతి విడుదల చేసిన ‘నా లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్..

Naa Love Story: అంతా కొత్తవాళ్లతో ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని దొమ్మరాజు అమరావతి, శ్రీకాలంత్ సంయుక్తంగా మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వినయ్ గోను డైరెక్ట్ చేస్తున్నారు.  
ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు "వినయ్ గోను, నేను రామ్ గోపాల్ వర్మ  దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేశాము. ఈ వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈ పోస్టర్ చాలా యూనిక్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కొత్త తరహా ఎమోషనల్ ప్రేమ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
 
దర్శకుడు వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద దర్శకుడు అవుతాడనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ.."మా పోస్టర్ లాంచ్ చేసిన నా దర్శక మిత్రులు అజయ్ భూపతి కి ప్రత్యేక  ధన్యవాదాలు" తెలుపుతున్నాను.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.."ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి మ్యూజిక్  అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్న నాకు డైరెక్టర్ వినయ్ నాకు అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు.  ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాను. ప్రేక్షకులు ఈ సినిమా మ్యూజిక్ ను గుర్తు పెట్టుకుంటారన్నారు. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్న మోహిత్ పెద్దాడ మాట్లాడుతూ.. ఒక మంచి లవ్ స్టోరీలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీా ఉందన్నారు. మా టీమ్ ని సపోర్ట్ చేసిన అజయ్ భూపతి కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలియచేసారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News