Naari: ఆమని ప్రధాన పాత్రలో ‘నారి’ చిత్రంలో మహిళ సాధికారత, స్త్రీ శక్తిని చాటే సాంగ్ విడుదల..

Naari:షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ల మీద శ్రీమతి శశి వంటిపల్లి ప్రొడ్యూసర్ గా  సూర్య వంటిపల్లి తెరకెక్కించిన మూవీ  ‘నారి’. ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  తాజాగా ఈ సినిమాలో మహిళా సాధికారికత, స్త్రీ శక్తిని చాటే పాటను విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 16, 2025, 02:45 PM IST
Naari: ఆమని ప్రధాన పాత్రలో ‘నారి’ చిత్రంలో మహిళ సాధికారత, స్త్రీ శక్తిని చాటే సాంగ్ విడుదల..

Naari:‘ఆమని’ నారీ గా టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో  కార్తికేయ దేవ్, ప్రగతి, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, సునయన, ప్రమోదిని, నిత్య శ్రీ, కేదార్ శంకర్, రాజమండ్రి శ్రీదేవీ వంటి వారు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఓ విద్యార్థిని తన టీచర్‌తో అమ్మాయిలు ఈ సొసైటీలో ఎదర్కొంటున్న కష్టాలు, సమస్యల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  తాజాగా  ఈ సినిమాలో విడుదల చేసిన పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.  అంతేకాదు ఈ వీడియో సోషల్ మీడియాలో 7 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకొని దూసుకుపోతుంది.

తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క గ్లింప్స్, టీజర్‌ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు. హైకోర్టు జస్టిస్ శ్రీమతి రాధారాణి , ఐఏఎస్ పూనం మాలకొండయ్య, ఐపీఎస్ జయచంద్ర  చేతుల మీదుగా ర్యాప్ సింగర్ సీషోర్ పాడిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి’ పాట  8 మిలియన్ల వ్యూస్‌తో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

 మహిళా దినోత్సవం సందర్భంగా నారి చిత్రాన్ని మార్చి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘నారి’ చిత్రం నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను  చిన్మయి శ్రీపాద ఆలపించారు. వినోద్ కుమార్ విన్ను సంగీతం అందించారు. మహిళా సాధికారత, స్త్రీ శక్తిని చాటేలా ఈ పాటను ప్రసాద్ సానా లిరిక్స్ అందించారు.

సాంగ్ రిలీజ్ సందర్భంగా సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ మహిళా ప్రధాన  చిత్రాలు, మహిళల సమస్యల మీద తీస్తున్న మూవీలను ప్రేక్షకులు  ఆదరిస్తుంటారు. ఈ మూవీలో ఆమని  నటన అలరిస్తుందన్నారు. ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకుల కంటతడి పెట్టించేలా ఉంటుందని మేకర్స్ తెలియజేసారు.  అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

నిర్మాత శశి వంటిపల్లి మాట్లాడుతూ.. ‘షి ఫిల్మ్, హైదరాబాద్ స్టూడియోస్ కలిసి కలిసి ఈ మూవీని  నిర్మించాము. ప్రతీ పురుషుడు తన కుటుంబంతో  తీసుకు వచ్చి ఈ చిత్రాన్ని చూపించాలన్నారు. ప్రతి ఒక్కరూ తపప్క చూడాల్సిన చిత్రమన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత చేతుల మీదుగా విడుదల  చేయబోతోన్నట్టుగా నిర్మాతలు  ప్రకటించారు.

నటీనటులు : ఆమని, ప్రగతి, సునయన, ప్రమోదిని, వికాస్ వశిష్ట, మోనికా రెడ్డి, నిత్య శ్రీ, కార్తికేయ దేవ్, ఛత్రపతి శేఖర్, కేదార్ శంకర్, నాగ మహేష్ తదితరులు

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News