Benefits and how to prepare yogurt face mask: మన ముఖం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, సహజసిద్ధంగా మన ఇంట్లో ఉండే వస్తువులతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు అంటే నమ్ముతారా? ఈ మాస్క్ వేసుకుంటే చాలు ఐదు ప్రయోజనాలు పొందుతారు. కేవలం వారంలోనే మచ్చలేని ముఖం మీసొంతమవుతుంది. మీ స్కిన్ కేర్ రొటీన్లో యోగర్ట్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
చర్మానికి ఎక్స్‌ఫొలియేషన్..
యోగర్ట్‌తో మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా ఇందులో ల్యాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన ముఖానికి క్లీన్ చేసి ఎక్స్‌ఫొలియేట్ చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న దురదను తగ్గించి డెడ్ స్కిన్ ను సైతం తొలగిస్తుంది.
వృధ్యాప్యం..
యోగార్ట్ ను మీ బ్యూటీ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు. కొన్ని నివేదికల ప్రకారం యోగర్ట్‌లో బయోయాక్టివ్ పెప్టైడ్ ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ల ఎఫెక్ట్ ఉంటుంది. యోగర్ట్‌లోని ఈ గుణాలు ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. మీ ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
యాక్నేకు చెక్..
యోగర్ట్ తో ఫేస్ మాస్క్ వేసుకుంటే ముఖం పై ఉండే యాక్నేకు సైతం చెక్ పెడుతుంది. యోగర్ట్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే యాక్నేను తగ్గించి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. యూరప్ పీఎంసీ జర్నల్ ప్రచురించిన స్డడీ ప్రకారం యోగర్ట్‌లో ఉండే జింక్ ఇన్ల్ఫమేటరీ యాక్నేను నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది.
ముఖకాంతి..
యోగర్ట్ మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకుంటే ఇందులోని లాక్టిక్ యాసిడ్ థైరోసైనేజ్ అనే ఎంజైమ్ వ్యాపించకుండా నివారిస్తుంది. ఇది ముఖంపై మెలనైన్ ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. యోగర్ట్ మీ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ఇది 2003 లో అధ్యయనంలో ఎక్స్‌పెరిమెంటర్ డెర్మటాలజీ జర్నల్ తేల్చింది.
ఇదీ చదవండి:విటమిన్ E పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను మన డైట్ లో చేర్చుకుంటే పొడవైన జుట్టు మీసొంతం..
స్కిన్ ఇన్ఫెక్షన్..
మీరు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే యోగర్ట్ మంచి రెమిడీ. యోగర్ట్‌లో ఉండే లాక్టిక్ యాసిడ్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సంబంధిత సమస్యలను త్వరగా నయం చేస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. 2015లో జరిగిన అధ్యయనం గురించి సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఫేస్‌మాస్క్ తయారు చేసుకునే విధానం..
యోగర్ట్ -1/2 కప్పు
పసుపు-1 TBSp
ఇదీ చదవండి: రెజ్యూమ్ తయారు చేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు: Google మాజీ రిక్రూటర్ సూచన
మాస్క్ తయారీ విధానం..
అరకప్పు యోగర్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి రెండిటినీ బాగా కలపాలి. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter