Spinach: పాలకూరతో ఇవి కలిపి తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి తిరుగుండదు..

Spinach Best Combination: పాలకూర తీసుకోవడం వల్ల శరీరం, కంటి, జుట్టుకు చర్మానికి మేలు జరుగుతుంది. అంతేకాదు జీర్ణ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ముఖ్యం.. పాలకూరలో విటమిన్ ఏ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఐరన్, కాల్షియం కూడా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 8, 2025, 09:31 AM IST
Spinach: పాలకూరతో ఇవి కలిపి తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి తిరుగుండదు..

Spinach Best Combination: పాలకూరను కొన్ని రకాల ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది.. పాలకూరను ఎలాంటి ఆహారలతో కలిపి తీసుకోవడానికి తెలుసుకుందాం.

గింజలు, విత్తనాలు..
పాలకూరతో బెస్ట్‌ కాంబినేషన్‌ గింజలు, విత్తనాలు అయిన బాదాం, వాల్నట్స్, చియా విత్తనాలు, అవిస గింజలు. వీటితో పాటు పాలకూర తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు... ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఇ, కే కూడా ఉండటం వల్ల ఇది అదనపు ప్రయోజనాలు అందిస్తాయి. పాలకూరతో ఈ విత్తనాలు కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు. స్మూతీ రూపంలో రెండిటిని కలిపి తీసుకోవచ్చు. 

అవకాడో..
అవకాడోలో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో కరిగే విటమిన్స్ ఉంటాయి. పాలకూరతో కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు.. అవకాడోను కట్ చేసి పాలకూరలో వేసుకొని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదా రెండిటిని కలిపి స్మూథీలా తయారు చేసుకొని కూడా తీసుకోవటం వల్ల మంచి ఖనిజాలు శరీరానికి అందుతాయి.

వెల్లుల్లి..
వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పాలకూరని వెల్లుల్లితో కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి కార్డియో ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. పాలకూరను వెల్లుల్లి కలిపి వేయించుకొని తీసుకోవచ్చు.

గుడ్లు..
గుడ్లలో ప్రోటీన్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇందులో లూటీన్, జియాంథీన్‌ కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కెరటానాయిడ్స్ పాలకూరలో ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. పాలకూరను గుడ్లతో కలిపి డిషెస్ తయారు చేసుకోవచ్చు. ఆమ్లెట్, ఫ్రీటాటా కూడా తయారు చేస్తారు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల సమతుల ఆహారం అవుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాలి.

ఇదీ చదవండి:  ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా? ఇలా 3 నెలలు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం తెలుసా?  

బీన్స్..
బీన్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉండటం వల్ల పాలకూరతో కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనం కలుగుతుంది.. బీన్స్, పాలకూరను కలిపి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులోని ఫైబర్, ప్రోటీన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

తృణధాన్యాలు..
పాలకూరను కొన్ని రకాల తృణధాన్యాలతో తీసుకోవడం వల్ల కూడా మంచి హెల్త్‌ బెనిఫిట్స్ పొందుతారు. క్వినోవా, బ్రౌన్ రైస్ తో కలిపి తీసుకోవాలి. ఇందులోని కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటుంది. ఇది పాలకూరతో కలిపి తీసుకోవటం వల్ల సమతుల ఆహారం అవుతుంది.. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. పాలకూర ఈ తృణధాన్యాలతో కలిపి వండుకోవచ్చు ఇది సలాడ్ రూపంలో కూడా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ పొందుతారు.

ఇదీ చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల మంజూరుకు తేదీ ఖరారు, ఎప్పుడంటే?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News