Poha Upma: రవ్వ ఉప్మా తిని తిని బోర్ కొడుతుందా? ఒక్కసారి ఇది ట్రై చేయండి..

Poha Upma Recipe: పోహాను తినేందుకు అందరూ ఇష్టపడతారు.  పోహాతో తయారు చేసిన ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? ఇది నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే పోహా ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2024, 03:20 PM IST
Poha Upma: రవ్వ ఉప్మా తిని తిని బోర్ కొడుతుందా? ఒక్కసారి ఇది ట్రై చేయండి..

 

Poha Upma Recipe: భారతీయులు పోహాతో వివిధ రకాల రెసిపీలను తయారుచేస్తారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే చాలామంది ఎక్కువగా పోహాతో ఉగ్గాని బజ్జీని తయారు చేస్తారు. మరికొంతమంది మాత్రం అటుకులతో పాయాసాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. వీటితో ఏ రెసిపీ తయారు చేసిన రుచి వేరే లెవల్ ఉంటుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోహా కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కొంతమంది అయితే అటుకులను చిన్నపిల్లలకు పాలలో మిక్స్ చేసి మరి తినిపిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. చాలామంది చియా సీడ్స్ తో తయారు చేసిన ఫుడ్స్ లో అటుకులను కూడా వినియోగిస్తున్నారు. ఇది నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

అయితే చాలామందికి పోహాతో తయారు చేసుకుని ఉప్మా రెసిపీ తెలియదు.! ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా సులభమైనప్పటికీ ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో?  చాలామందికి తెలియదు. ప్రతిరోజు రవ్వ ఉప్మా తినీ తిని బోర్ కొడుతుంటే తప్పకుండా ఓసారి కోహ ఉప్మాను ట్రై చేయండి. ఈ ఉప్మా తయారు చేయడం సులభమే. కరెక్ట్ అయినా కొలతలతో తయారు చేస్తే అద్భుతమైన రుచితో ఈ ఉప్మా ని పొందుతారు. మీరు కూడా ఇంట్లో పోహా ఉప్మాను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇప్పుడే తయారు చేసుకోండి.

పోహా ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు:
2 కప్పుల పోహ (అటుకులు)
1/2 కప్పు కందిపప్పు (చిన్నదిగా తరిగినది)
1/2 కప్పు కొత్తిమీర (తరిగినది)
1/4 కప్పు శనగపప్పు (పొడిగా వేయించినది)
2 టేబుల్ స్పూన్లు నూనె
1 టేబుల్ స్పూన్ వెనెగర్
1 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 టీస్పూన్ ఎండు మిరపకాయలు (తరిగినవి)
1/2 టీస్పూన్ కరివేపాకు
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/4 టీస్పూన్ ధనియాల పొడి
1/4 టీస్పూన్ గరం మసాలా
ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం:
ముందుగా ఈ పోహా ఉప్మాను తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక గిన్నెలో పోహను గ్రైండ్ చేసిన రవ్వను 10 నిమిషాలు నానబెట్టుకోండి.
ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.
అన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేవరకు వేయించాలి.
ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా కందిపప్పు, పసుపు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇలా అన్ని వేగిన తర్వాత నానబెట్టిన పోహ, శనగపప్పు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత 2-3 నిమిషాలు ఉడికించి, కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

చిట్కాలు:
ఈ పోహా ఉప్మా మరింత రుచిగా ఉండడానికి కూరగాయలు (ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్లు) కూడా వేసి వేయించవచ్చు.
పోహా తినే క్రమంలో నిమ్మరసం పైనుంచి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే అద్భుతమైన రుచిని పొందుతారు.
ఈ రెసిపీలో కావాలనుకుంటే పచ్చబటానీలు కూడా వినియోగించవచ్చు. ఇవి నూటికి మరింత రుచినందిస్తాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News