Best Summer Foods: ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల బరువు పెరిగిపోతుంటారు. అందుకే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్దాలు బరువుని నియంత్రించడమే కాకుండా ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరుస్తాయి. వేసవిలో అవసరమైన చర్మ సంరక్షణకు దోహదపడతాయి.
వేసవికాలంలో కేవలం బరువు నియంత్రణ కోసమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ అనేది చాలా చాలా అవసరం. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా అధిక బరువు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేయవచ్చు. ముఖ్యంగా మూడు రకాల సమ్మర్ ఫుడ్స్ మంచివని ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఇందులో పుచ్చకాయ సలాడ్, కీరా అల్లం రసం, బేల్ ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి. ఇందులో ఉండే వివిధ పోషకాల కారణంగా శరీరం హైడ్రేట్‌గా ఉండటం, జీర్ణక్రియ మెరుగుపడటం, బరువు తగ్గడం వంటి ఫలితాలు గమనించవచ్చు.
కీరా అల్లం రసం
కీరాలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటు అల్లం విషయానికొస్తే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో స్వెల్లింగ్ సమస్య తగ్గి మెటబోలిజం పెరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల వేసవిలో మంచి హైడ్రేట్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. చర్మం హెల్తీగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
బేల్ ఫ్రూట్ జ్యూస్
బేల్ ఫ్రూట్ అనేది ప్రకృతిలో లభించే అద్భుతమైన హైడ్రేటింగ్ గుణాలు కలిగిన ప్రూట్. రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు అవసరమైన పదార్ధాలు ఇందులో ఉంటాయి. వేసవికాలంలో జీర్ణక్రియ సులభతరం అయ్యేందుకు దోహదపడుతుంది. బరువు నియంత్రణ, వెయిట్ లాస్, స్కిన్ హెల్త్ కోసం ఇది తప్పనిసరి.
పుచ్చకాయ సలాడ్
ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటమే కాకుండా తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దాంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు తగ్గించే ప్రక్రియలో పుచ్చకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి కల్గించే హాని నుంచి కాపాడుతాయి.
Also read: FD Interest Rates: ఎఫ్డీపై అత్యధికంగా 9.60 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook