Guava Leaves Juice Benefits: ఆయుర్వేద శాస్త్రంలో అన్ని ఆకుల గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. ఏయే ఆకులు ఏయే అనారోగ్య సమస్యలకు వినియోగించాలి.. అనే విషయాలను ఎంతో క్లుప్తంగా వివరించారు. మన పూర్వీకులు ఆయుర్వేద పద్ధతిలో మాత్రమే చిక్సిత చేయించుకునేవారు.. ముఖ్యంగా కొన్ని రకాల ఆకులతో ఎక్కువగా చికిత్స చేసేవారు.. ఇదిలా ఉంటే జామ ఆకులను చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగించేవారు.. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి రోజు ఈ ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది.
జామ ఆకుల రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి:
జామ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ ఆకులతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాధులను తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. అలాగే దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
జామ ఆకులలో విటమిన్ సితో పాటు ఇతర ఔషధ గుణాలు లభిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థను దృఢంగా చేసేందేకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. అలాగే అజీర్ణం, పొట్ట సమస్యలను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది:
జామ ఆకుల రసంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ రసం తాగితే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
కంటి ఆరోగ్యానికి..:
జామ ఆకులలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది.
గుండె సమస్యలు:
జామ ఆకుల రసం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను నివారించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీని కారణంగా గుండెపోటు, ఇతర గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి