Diabetes Control Tips: రావి ఆకుల్లో శరీరానికి కావాల్సిన ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకుల రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఆ ఆకులను రసంలా చేసి తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఈ సమస్యలకు చెక్:
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి:
రావి ఆకుల జ్యూస్ ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. ఈ రసం ఊపిరితిత్తులను నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో మంట సమస్య కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే.. రావి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
రావి ఆకులల్లో ఉండే లక్షణాలు దగ్గును నయం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీని రసం క్రమం తప్పకుండా తాగితే దగ్గు సమస్య సులభంగా తొలగిపోతాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల శ్లేష్మం సమస్య కూడా దూరమవుతాయి.
జీర్ణక్రియ ప్రయోజనకరంగా ఉంటుంది:
రావి ఆకుల రసాన్ని తాగడం వల్ల డయేరియా సమస్య సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. విరేచనాలతో పాటు వికారం సమస్యను కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపణులు తెలుపుతున్నారు. అంతే కాకుండా పొట్ట సమస్యలైనా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఈ రసం చెక్ పెడుతుంది.
రక్తాన్ని శుభ్రం చేస్తుంది:
రావి ఆకులను జ్యూస్ లేదా డిటాక్స్ డ్రింక్‌గా తాగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు కూడా తగ్గతాయి. కాబట్టి తప్పకుండా రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
చక్కెర నియంత్రణలో ఉంటుంది:
ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి పనిచేస్తుంది. పీపాల్ ఆకులలో ఉండే లక్షణాలు స్పైక్‌ను నియంత్రిస్తాయి. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి