Curry Leaves Health Benefits: కరివేపాకు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే గుణం కలిగి ఉంటుంది. కరివేపాకు తినడం వల్ల ఇన్సూలిన్ నిరోధకతను పెంచుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఉదయం పరగడుపున రెండు కరివేపాకు ఆకులు నమిలితే మంచిది.
కరివేపాకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జుట్టు కూడా నల్లగా పొడుగ్గా పెరుగుతుంది. ఇందులో బీటా కెరోటీన్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును మందంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు తరచూ కరివేపాకు నమలడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్య కూడా రాదు. కరివేపాకు మన డైట్‌లో ఉండే జుట్టూ ఆరోగ్యంగా నల్లగా పెరుగుతూనే ఉంటుంది. దీంతో హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు.
అంతేకాదు కరివేపాకుతో ఆరోగ్యప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. కరివేపాకులో ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. కరివేపాకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీగా పనిచేస్తుంది. కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్య ఉన్నవారు కరివేపాకు నమలాలి. దీంతో కడుపులో యాసిడిటీ తగ్గిపోతుంది. కడుపు ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది.
అంతేకాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు కరివేపాకు తీసుకోవాలి. దీంతో ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. బరువు తగ్గుతరారు. ఇది క్యాలరీలను కరిగించేస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు కరివేపాకు నమలాలి. కాలేయ ఆరోగ్యానికి కూడా కరివేపాకు తోడ్పడుతుంది. ఇది మంచి డిటాక్సిఫైయర్‌లా పనిచేస్తుంది. కరివేపాకు తింటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపించేస్తుంది. శరీర ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయి.
ఇదీ చదవండి: పసుపును ఇలా నీళ్లలో కలిపి తీసుకుంటే.. ఒంట్లో ఉన్న చెడుకొవ్వు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.
కరివేపాకులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటీవ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇవి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. కరివేపాకు తింటే కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కరివేపాకును పచ్చిగా తినచ్చు లేదా పొడి రూపంలో కూడా కారం పొడ తయారు చేసుకుంటారు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని హానికర కిరణాల నుంచి కాపాడుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గిపోతాయి. అంతేకాదు కరివేపాకుతో హెయిర్ ప్యాక్ కూడా తయారు చేస్తారు. కలబంద, కరివేపాకు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. కరివేపాకు నూనె కూడా తయారు చేసుకుంటారు. కరివేపాకు, కలబంద కలిపి కొబ్బరినూనెలో తక్కువ మంటపై వేడి చేయాలి. ఆ తర్వాత ఈ నూనె వడకట్టుకుని జుట్టుకు అప్లై చేయాలి. లేదంటే కరివేపాకుపేస్ట్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: సర్కారీ నౌకరీ మీ కల? రూ.180000 జీతం.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.