Civils Notification 2025: దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ర్యాంకులకు సంబంధించినవి. వీటినే సివిల్ సర్వీసెస్ అంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇందుకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ చేపడుతుంటుంది. అదే విధంగా సివిల్స్ నోటిఫికేషన్ 2025 వెలువరించింది.
సివిల్స్ పరీక్షలకు సిద్ధం కావాలంటే ఓ యజ్ఞం చేసినట్టు చేయాలి. అప్పుడే ఈ పరీక్షలో ఉత్తీర్ణులై దేశంలోని అత్యున్నత కొలువు సాధించగలరు. సివిల్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్ధులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు.ఇప్పుడు మరోసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11 అప్లికేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ. దాదాపు వేయికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. హాల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయో పరిమితి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకూ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఓబీసీ, జనరల్ విద్యార్ధులకు అప్లికేషన్ ఫీజు 100 రూపాయు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు ఉండదు.
పరీక్ష విధానం ఎలా ఉంటుంది
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లలో ఉంటుంది. పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2లో ఇంగ్లీషు, రీజనింగ్ ఉంటాయి. రెండవ పేపర్‌లో కనీస మార్కులు పొందితేనే మొదటి పేపర్ వ్యాల్యుయేషన్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. మెయిన్స్ మాత్రం డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఆ తరువాత చివరిగా ఇంటర్వ్యూ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి