Elderly son locked her mother in house Jharkhand: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన కుంభమేళ కావడంతో ప్రతి ఒక్కరు కూడా బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహానాల్లో ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. కుంభమేళకు చాలా మంది తమ పెద్దవాళ్లను అందర్ని తీసుకొని పోతున్నారు.ఎలాగైన పుణ్యస్నానాలు చేయించాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
రామ్‌గఢ్ జిల్లాలో నివాసం ఉంటున్న అఖిలేష్ ప్రజాపతి అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి కుంభమేళకు వెళ్లాడు .అయితే.. అతను వెళ్లేటప్పుడు.. తన తల్లి సంజు దేవి (65) ఇంట్లోనే ఉంచి ఫిబ్రవరి 17న తాళం వేశాడు. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంది. అయితే.. తాజాగా.. ఆమె ఇంట్లో నుంచి గట్టిగా కేకలు పెడుతున్న ఘటనలను చుట్టుపక్కల వారు గుర్తించారు. వెంటనే తలుపులు పగలకొట్టి ఆమెను బైటకు తీసుకొచ్చారు.
यह पुण्य नहीं,पाप है।
मां को घर में कैद कर बेटा गया महाकुंभ: चार दिनों बाद वृद्धा को पड़ोसियों ने घर से बाहर निकाला, अस्पताल में कराई गईं भर्ती#Jharkhand #MahaKumbh2025 pic.twitter.com/lP7bZXyImw
— Anirudh vishwakarma Journalist Political critic (@anirudhvish65) February 20, 2025
ఆమె ఆకలితో అలమటిస్తు.. ప్లాస్టిక్ లు తినేందుకు కూడా ప్రయత్నించింది. తాగేందుకు కూడా నీళ్లు కూడా అక్కడ లేవు. ఈ ఘటన చూసి అక్కడున్న వారంత.. చలించి పోయారు. ఆమె కుమారుడికి ఫోన్ చేయగా.. తాము వచ్చేటప్పుడు కావాల్సినవి అన్ని పెట్టి వచ్చామని చెప్పడంతో అక్కడి వాళ్లుషాక్ అయ్యారు. అనవసరంగా రాద్దాంతం చేయోద్దని కూడా ఫోన్ కాల్ కట్ చేశారు. దీంతో స్థానికులు ఆమెకు అన్నం, నీళ్లు పెట్టి తమ ఇళ్లలో ఉంచుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే ఆమె కూతురికి సమాచారం ఇచ్చారు.
బాధితురాలు సంజు దేవి కుమార్తె చాందిని దేవి మాట్లాడుతూ.. సోదరుడు కుంభమేళాకు బయలుదేరే ముందు ఆమెను ఇంట్లో ఉంచి వెళ్లే బదులు.. తన వద్ద ఉంచి వెళితే.. తాను చూసుకునే దాన్నని చెప్పింది. దీనిపై ఫిర్యాదు చేస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హమీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఘటన మాత్రం దేశంలో దుమారంగా మారింది. నవమాసాలు మోసీ కని పెంచిన తల్లిని కొడుకు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు కుంభమేళలో కాదు.. పది కుంభమేళలో స్నానాలు చేసిన వారి పాపాలు పోవని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లను కఠినంగా పనిష్మెంట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి