Jio Cheap and Best Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు అన్నింటికీ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాల ప్రభావం కన్పిస్తోంది. గతంలో ఉన్నట్టు కాకుండా వాయిస్ ఓన్లీ ప్రీ పెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో నుంచి చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ కూడా వచ్చేసింది.
రిలయన్స్ జియో నుంచి కొత్తగా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ఇప్పటికే అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ప్రకటించింది జియో. వాస్తవానికి ఇది పాత ప్లానే. బాగా ప్రాచుర్యం పొందిన ప్లాన్ ఇది. ఓన్లీ వాయిస్ ప్లాన్స్ ప్రవేశపెట్టే క్రమంలో చడీచప్పుడు లేకుండా తొలగించింది. ఈ ప్లాన్ ధర 189 రూపాయలు. 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. టోటల్ హైస్పీడ్ డేటా 2జీబీ అందుతుంది. ఈ ప్లాన్ తొలగించడంపై విమర్శలు రావడంతో తిరిగి అందుబాటులో తీసుకొచ్చింది. డేటా పెద్దగా అవసరం లేనివాళ్లు, ఇంట్లో వైఫై సదుపాయం ఉన్నవాళ్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే జియోపై భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తిరిగి ఈ ప్లాన్ తీసుకొచ్చేసింది.
ఇక రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన వాయిస్ ఓన్లీ కాల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 448 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఇది 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. డేటా మాత్రం అస్సలు ఉండదు.
ఇక రెండవ వాయిస్ ఓన్లీ ప్లాన్ దీర్ఖకాల వ్యాలిడిటీ కలిగింది. ఈ ప్లాన్ ధర 1748 రూపాయలు. వ్యాలిడిటీ 336 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూడా డేటా అస్సలు ఉండదు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.
Also read: Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుందో చూద్దామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి