Rahul Gandhi Lok Sabha Membership Restored: లోక్‌సభలో అడుగుపెట్టేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయింది. రాహుల్‌పై అనర్హతను ఎత్తివేస్తూ.. సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక నుంచి రాహుల్ గాంధీ పార్లమెంట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 'మోడీ' ఇంటిపేరుపై చేసిన వ్యాఖల కేసులో దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ సెక్రటేరియట్లో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
సోమవారం సాయంత్రంలోగా రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించకుంటే.. మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావించింది. అయితే అంతకుముందే రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఆయన ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.
దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై పూర్ణేష్ మోడీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సూరత్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ కోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది.
అనంతరం సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంలో ట్రయల్ కోర్టు సరైన కారణాలను చూపించలేదని పేర్కొంది. ఇలాంటి శిక్ష విధించడం వల్ల ఒక్కరికే కాకుండా.. మొత్తం నియోజకవర్గం హక్కును దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం సోమవారం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరణ అయింది.
Also Read: Gaddar: మూగబోయిన ఉద్యమ గళం.. నేడు అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు..
Also Read: TSPSC : ముందుగా ప్రకటించిన తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి