Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?

Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టును తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 12:48 PM IST
Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?

Rahul Gandhi Defamation Case: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. 2019లో మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా.. ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించింది. శిక్ష తీర్పు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీకి కూడా బెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. పరువు నష్టం కేసులో గరిష్టంగా రెండేళ్ల శిక్ష విధించే నిబంధన ఉంది. కోర్టు నిర్ణయాన్ని ఫిర్యాదుదారు స్వాగతించారు. కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై కూడా కత్తి వేలాడుతోంది.

విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ కోర్టుకు తన ఉద్దేశం తప్పేమీ కాదన్నారు. తన ప్రకటన వల్ల ఎవరికీ నష్టం జరగలేదన్నారు. ఈ కేసులో తనకు తక్కువ శిక్ష విధించాలన్నారు. విచారణ సందర్భంగా తన ప్రకటనపై క్షమాపణ చెప్పేందుకు రాహుల్ నిరాకరించారు. సూరత్ కోర్టు తీర్పు తరువాత బీజేపీ విమర్శల దాడికి దిగింది. సూరత్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి దర్శనా జర్దోష్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రకటనపై సూరత్‌లోనే కాదు గుజరాత్‌లోని ఓబీసీ సమాజం ఆగ్రహంగా ఉందనని అన్నారు. కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.

అసలు ఏం జరిగిందంటే..?

2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ గాంధీ ప్రకటన మొత్తం మోడీ వర్గాన్ని కించపరిచేలా ఉందని.. మోడీ వర్గం పరువు తీశారని దుయ్యబట్టారు. 

రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 (పరువు నష్టం) కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు అక్టోబర్ 2021లో రాహుల్ గాంధీ తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సూరత్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ ర్యాలీలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ప్రసంగం సీడీలు రుజువు చేస్తున్నాయని పూర్ణేష్ మోడీ తరపు న్యాయవాది వాదించారు. దీనికి ప్రతిగా రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 202 ప్రకారం న్యాయ ప్రక్రియను అనుసరించనందున.. ప్రొసీడింగ్‌లు మొదటి నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. 

బాధితపక్షంగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉండాల్సింది పూర్ణేష్ మోడీ కాదని.. ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా ఆయన వాదించారు. రాహుల్ గాంధీ ప్రసంగాలు చాలా వరకు ప్రధానిని లక్ష్యంగా చేసుకున్నవేనని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మార్చి 23కి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

Also Read: Ind Vs Aus: ఫైనల్‌ ఫైట్‌లో ఆసీస్ హిట్.. భారత్ ఫ్లాప్ షో.. సిరీస్‌ కంగారూలదే..

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News