Pregnant Woman: రైళ్లల్లోనూ మహిళలకు భద్రత ఉండడం లేదు. గర్భిణి అనే సోయి లేకుండా ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆమెను సైకో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశాడు. కింద పడడంతో గర్భిణికి తీవ్ర గాయాలవగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమిళనాడులో జరిగిన ఈ ఘోర సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన 4 నెలల గర్భిణి తిరుపూర్‌లోని ఓ దుస్తుల కంపెనీలో టైలర్‌గా పనిచేస్తోంది. గురువారం కోయంబత్తూరు నుంచి తిరుపతికి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వస్థలం చిత్తూరుకు బయల్దేరింది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లింది. అయితే అక్కడ హేమారాజ్ అనే సైకో ఎదురయ్యాడు. ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురయిన బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది.
Also Read: Viral Video: బుడ్డోడి దేశభక్తికి 'భరతమాత' ఫిదా.. నెట్టింట్లో వైరల్‌గా వీడియో
ఇరువురి మధ్య తోపులాట జరగ్గా నిందితుడు వెంటనే గర్భిణిని కదులుతున్న రైలు నుంచి బయటకు తోసి వేశాడు. అతడు తోసివేయడంతో పట్టాల పక్కన పడిన గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి. చేయి, కాలు విరిగి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనపై జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందించగా రైల్వే పోలీసులు గర్భిణిని వెంటనే కాపాడి వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు హేమరాజ్ కరుడుగట్టిన నేరస్తుడిగా గుర్తించారు. హేమరాజ్‌ను కుడియాతం సమీపంలో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. 2024 ఏప్రిల్‌లో చెన్నైలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళపై లైంగిక కోరిక తీర్చుకుని అనంతరం ఆమెను హత్య చేశాడు. 2022 నవంబర్‌లో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా రైళ్లలో తరచూ నేరాలు చేస్తుంటాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter