PM Modi to visit US to attend first in-person Quad summit to be hosted by Biden: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నిర్వహణలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో (Quad summit) పాల్గొననున్నారు మోదీ. అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ (Kamala Harris), యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మోదీ సెప్టెంబర్ 22న వాషింగ్టన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశం అవుతారు. అందులో టిమ్ కుక్ (Tim Cook) కూడా ఉండనున్నట్లు సమాచారం. అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాతో సమావేశం అవుతారు మోదీ.
Also Read : AP CM YS JAGAN: ఎన్నికల్లో విజయంతో ప్రజల పట్ల బాధ్యత పెరిగింది
ఆసక్తికర విషయాలపై చర్చ
అలాగే మోదీ, (Modi) బైడెన్ మధ్య పలు ఆసక్తికర విషయాలపై చర్చ సాగనున్నట్లు సమాచారం. అఫ్గానిస్థాన్ పరిణామాలు, కొవిడ్-19, ఇండో-పసిఫిక్, ఉగ్రవాదం వంటి అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక పర్యటనలో చివరి రోజున యూఎన్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తారు.
Also Read : Kohli Captaincy Exit: ఈ సమయంలో ఆ నిర్ణయమేంటని కోహ్లీపై గంభీర్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo
PM Modi US visit: మూడు రోజుల పాటు మోదీ అమెరికా పర్యటన.. జో బైడెన్‌తో పాటు రెండు ప్రముఖ దేశాల ప్రధానులతో సమావేశం
సెప్టెంబర్ 22న వాషింగ్టన్‌కు చేరుకోనున్న మోదీ
మోదీ, బైడెన్ మధ్య పలు ఆసక్తికర విషయాలపై చర్చ
అఫ్గానిస్థాన్ పరిణామాలు, కొవిడ్-19 తదితర అంశాలపై చర్చ