Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్

ముక్కంటికి కష్టమొచ్చింది. చేయని నేరానికి శిక్షఅనుభవించే పరిస్థితి దాపురించింది. సాక్షాత్తూ మహాశివుడికే ఏం కష్టం అనుకుంటున్నారా. నిజంగా మనదేశంలోనే అదీ పక్కనున్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే శివలింగాన్ని కోర్టులో హాజరుపర్చారు.  వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 04:54 PM IST
  • శివుడితో సహా అందరికీ నోటీసులిచ్చిన తహసీల్దార్
  • విచారణకు శివలింగాన్ని తీసుకెళ్లిన జనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
  • అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం
Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్

Lord Shiva Linga: ముక్కంటికి కష్టమొచ్చింది. చేయని నేరానికి శిక్షఅనుభవించే పరిస్థితి దాపురించింది. సాక్షాత్తూ మహాశివుడికే ఏం కష్టం అనుకుంటున్నారా. నిజంగా మనదేశంలోనే అదీ పక్కనున్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే శివలింగాన్ని కోర్టులో హాజరుపర్చారు.  వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. 

ఆ మధ్య వచ్చిన గోపాల గోపాల సినిమా  గుర్తుండే ఉంటుంది. యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఓ ఇన్సురెన్స్ కంపెనీ తనకు నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరించడంతో  హీరో వెంకటేష్ దేవున్ని కోర్టుకు లాగుతాడు. దేవాలయాలకీ, పలువురు బాబాలకీ సమన్లు పంపిస్తాడు. అయితే అదంతా దర్శకుడు ఊహాత్మకంగా తీసిన సినిమా. కానీ చత్తీస్‌గఢ్ లో ఇప్పుడు నిజంగానే దేవుడిని కోర్టుకు లాగారు.

రాయగఢ్ లో కొంతమంది శివుడి గుడి కట్టడానికి సంకల్పించారు. అందుబాటులో ఉన్న ఓ భూమిలో నిర్మాణపనులు ప్రారంభించారు. అయితే దీనిపై సుధా రజ్వాడే అనే మహిళ అభ్యంతరం చెప్పింది. బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 16 మంది కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడి నిర్మిస్తున్నారంటూ ఆరోపించింది. ఇందులో ముక్కంటిని కూడా చేర్చింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు వెంటనే దర్యాప్తుచేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం స్థానిక తహసీల్దార్ ఆఫీసుకు దర్యాప్తు చేయాలని చెప్పింది. రంగంలోకి దిగిన తహసీల్దార్ ఇక తన బుర్ర మొత్తం ఉపయోగించి కేసును తవ్వడం మొదలుపెట్టాడు.  ప్రాథమిక విచారణ పూర్తిచేసి అందుబాటులో ఉన్న ఓ చట్టాన్ని బయటకు తీసి శివుడితో సహా అందరికీ నోటీసులిచ్చాడు. ఈ నెల 25 న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నాడు. విచారణకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని.. భూమిని ఖాళీచేయించడంతో పాటు పదివేల జరిమానా విధిస్తామని హెచ్చరించాడు. దీంతో శివలింగాన్ని పెకిలించి ట్రాలీలో వేసుకొని విచారణకు తీసుకుపోయారు. విచారణ అనంతరం కేసును వాయిదావేశారు. శివలింగాన్ని విచారణకోసం తీసుకుపోతున్న ఫోటోలు ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడా ఫోటోలు వైరల్ గా మారాయి.

చత్తీస్‌గఢ్ లో ఈ ఘటనపై సాధారణ జనం మండిపడుతున్నారు. దేవుడిపై ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన శివలింగాన్ని పెకిలించి విచారణ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ పోలీసు కస్టడీకి అనుమతిస్తే తీరా మహాశివున్ని జైలుపాలు చేశావారేమో అని ఫైరవుతున్నారు. ఏదేమైనా తెలివితక్కువ అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే చత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గతంలో జజ్‌గిర్-చంపా జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు కూడా భోలేనాథ్ ఆలయానికి నోటీసులిచ్చారు. వెంటనే అక్కడినుంచి గుడిని ఖాళీచేయాలని ఆదేశించారు.

Also Read: రైతులతో పెట్టుకుంటే అంతే.. బీజేపీ భరతం పట్టడం ఖాయం.. కేంద్రంపై బాల్క సుమన్ ఫైర్..

Also Read: INDW vs SAW: టీమిండియాకు షాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ! నోబాల్ ఎంతపని చేసే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News