Mothers Powerful Letter: ప్రాణం తీసిన పనిభారం.. ఉద్యోగంలో చేరిన 4 నెలలకే యువతి బలవన్మరణం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ..

Mothers' Letter To EY Company: దారుణం.. సీఏ ఉద్యోగిగా పనిచేస్తున్న యువతి చేరిన నాలుగు నెలల్లోనే బలవన్మరణానికి పాల్పడింది. కనీసం సంస్థ నుండి అంత్యక్రియలకు ఎవరూ హాజరు కాలేదు.  ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఎందుకంటే బాధితురాలి తల్లి కంపెనీకి రాసిన ఓ లెట్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Sep 19, 2024, 12:35 PM IST
Mothers Powerful Letter: ప్రాణం తీసిన పనిభారం.. ఉద్యోగంలో చేరిన 4 నెలలకే యువతి బలవన్మరణం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ..

Mothers' Letter To EY Company:  పని అంటే ఆడుతూ, పాడుతూ హాయిగా రోజు గడిచిపోయేలా ఉంటే బాగుండూ అని మనం ప్రతిరోజూ అనుకుంటాం. కానీ, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు అలా కాకుండా ప్రాణాలు తీసేవిగా ఉన్నాయి. ఇటీవలె చైనాలో వరుసగా ఎన్నో గంటలు పనిచేసిన ఓ ఉద్యోగి ఆర్గన్స్‌ ఫెయిలై చనిపోయాడు. ఆ ఘటన మరవకముందే మరో ఘటన పూనెలో చోటుచేసుకుంది. సీఏ గా పనిచేస్తున్న అన్నా సెబాస్టీయన్‌ పెరైల్ (26) అనే యువతి పనిభారం ఎక్కువై కేవలం ఉద్యోగంలో చేరిన 4 నెలలకే బలవన్మరణానికి పాల్పడింది.

ఈ నేపథ్యంలో తల్లి ఆ యువతి పనిచేసిన EY కంపెనీకి ఓ లెట్టర్‌ రాసింది. 'అధిక పనిఒత్తిడి'తో తన కూతురు ప్రాణాలు పోయాయని తల్లి రాసిన ఆ లెట్టర్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. తన కూతురు అర్ధరాత్రి, వారాంతాల్లో కూడా పనిచేసేదని కానీ, సంస్థ మానవీయ విలువలు తన కూతురు మరణానికి కారణమైందని చెప్పుకొచ్చారు. ఆమె మరణానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ తన కూతురు కొన్ని వారాలుగా ఛాతీలో నొప్పి అనుభవించిందని ఈవై చైర్మన్‌ రాజీవ్‌ మామనికి అనిత అగస్టీన్‌ రాసిన లెట్టర్‌ వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

 ఈవై అన్న మొదటి జాబ్‌. ఆమె ఎంతో ఉత్సాహాంగా సంస్థలో పనిచేయానికి ఇష్టపడేది అని తల్లి అనిత రాసుకొచ్చింది. తన కూతురు ఓ ఫైటర్‌లా పనిచేసేది. స్కూలు, కాలేజీల్లో కూడా తన కూతురు టాపర్‌. అందుకే పని ప్రదేశంలో నిరంతరం అస్సలు నీరసించకుండా పనిచేసింది. ప్రతి టార్గెట్‌ను పూర్తి చేస్తూ వెళ్లింది. కొత్తవాతావరణం, పనిభారం, గంటలపాటు పనిచేయడం ఆమెను ఫిజికల్‌గా కాకుండా మెంటల్‌గా కూడ కూడా దెబ్బతీసింది. దీనివల్ల ఆమె యాంగ్జైటీకి కూడా గురైంది. నా కూతురు పనిభారంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అయినా కానీ, తను అనుకున్న సక్సెస్‌ సాధించాలంటే తప్పదు, హార్డ్‌ వర్కే సక్సెస్‌కు మొదటి మెట్టు అని అనుకునేది అన్నారు. 

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

అయితే, జూలై నెలలో 6వ తారీఖున అన్న సీఏ కాన్వొకేషన్‌కు భర్తతోపాటు అటెండ్‌ అయ్యాం. అప్పుడు ఛాతిలో కాస్త నొప్పి ఉందని గత వారం రోజులుగా ఉద్యోగం నుంచి  పీజీకి చేరుకునేసరికి రాత్రి 1 అవుతుందని చెప్పింది. వెంటనే పూనేలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాం ఈసీజీ తీస్తే నార్మల్ అని చెప్పారు. కార్డియాలజిస్ట్‌ ఆమెకు సరైన నిద్ర లేదు అందుకే ఇలా జరుగుతుందని చెప్పారు. తగిన మందులు రాసారు. ఫర్వాలేదు అన్ని చెప్పారు. ఆ తర్వాత మేం కొచ్చికి తిరిగి వచ్చేసాం. కానీ, అన్న లైఫ్‌ మళ్లీ రొటీన్‌ నిద్రలేని రాత్రులు పనిఒత్తిడి ఆమెకు కనీసం ఒక్కరోజు కూడా లీవ్‌ దొరికేది కాదు అని అన్నారు.

అయితే, అన్న చేరిన టీమ్‌లో ఇప్పటివరకు ఎంతో మంది రిజైన్‌ చేశారని చెప్పేదట. దీనికి పనిభారమే కారణం. నా కూతురు పనిభారంతో పర్సనల్‌ లైఫ్ ఉంటుందనే సంగతే మర్చిపోయింది. అన్న మేనేజర్‌ వారాంతాల్లో కూడా పని చెప్పేవాడు. ఆమెకు వార్నింగ్‌ ఇచ్చేవారు క్రికెట్‌ కోసం మేనేజర్‌ మీటింగ్‌ను రీషెడ్యుల్ చేసేవాడు ఆ వర్క్‌ తనపై పడేది. ఒక్కోసారి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినప్పుడు తనకు ఊపిరి ఆడనట్లుగా భావించేదట, చివరకు దుస్తులు కూడా మార్చకుండా అలాగే పడుకునేదట. సోషల్‌ మీడియాలో ఈ లెట్టర్‌ని చదివి సదరు సంస్థపై మండిపడుతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News