మరో అగ్ని ప్రమాదం.. మంటల్లో మరో 100 కార్లు !

మరో అగ్ని ప్రమాదం.. మంటల్లో మరో 100 కార్లు

Last Updated : Feb 24, 2019, 05:35 PM IST
మరో అగ్ని ప్రమాదం.. మంటల్లో మరో 100 కార్లు !

చెన్నై: బెంగళూరులో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో సుమారు 300 వాహనాలు దగ్ధమైన ఘటన ఇంకా మరవక ముందే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెన్నై శివార్లలోని  శ్రీరామచంద్ర మెడికల్ యూనివర్శిటీకి సమీపంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కార్ల గోడౌన్‌లో చెలరేగిన మంటలు గోడౌన్ మొత్తానికి వ్యాపించడంతో అందులో పార్క్ చేసి వున్న సుమారు 100కుపైగా కార్లు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 10 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. 

పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి వున్న కార్లలో కొన్ని ఓ ప్రైవేటు కంపెనీకి చెందినవేనని తెలుస్తోంది. అందులో కొన్ని కొత్త కార్లు కాగా ఇంకొన్ని పాత కార్లు వున్నాయి. ఈ ఘటనతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Trending News