Mahakumbh Mela 2025 Yogi: ఉత్తర ప్రదేశ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగైన మహా కుంభమేళాలకు కోట్లాది భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 15 కోట్ల మంది పవిత్ర సంగమ స్థానంలో పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగా, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతేకాదు ఆయన క్యాబినేట్ సహచరులు 54 మంది పవిత్ర సంగమ స్థానంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక త్రివేణి సంగమంలో సీఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రయాగ్ రాజ్ లో నిర్వహించారు.
యోగి ఆదిత్యనాథ్ గత కొన్నేళ్లుగా ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అడుగడునా నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాదు డ్రోన్స్ సహాయంతో ప్రతి ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నారు. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెడుతున్నారు. ఎక్కడక్కడ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లతో పాటు గ్యాంగ్ స్టర్స్ ను ముందుగానే బైండోవర్ చేశారు. అలాగే అసాంఘిక శక్తుల కదలికపై దృష్టి పెట్టారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాకు భక్తులు రోజురోజుకు మరింత పెరుగుతున్నారు. ఇప్పటికే దాదాపు 15 కోట్ల మంది గంగ, యమున, సరస్వతి నదుల కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు సమాచారం. ఇక రాబోయే పుష్య అమావాస్య రోజుతో పాటు.. వసంత పంచమి, రథ సప్తమి రోజున ఎక్కువ మంది భక్తులు మహా కుంభమేళాకు తరలి రానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయుల కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ జన సందోహంగా మారింది. వచ్చే నెల 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు.. దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.