India Covid-19 updates: న్యూఢిల్లీ: భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల నుంచి మరణాలు సంఖ్య కూడా వేయి మార్క్ దాటి రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత 24 గంటల్లో బుధవారం ( ఆగస్టు 26న ) దేశవ్యాప్తంగా కొత్తగా 75,760 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,023 మంది మరణించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) గురువారం తెలిపింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,10,235 కు చేరుకోగా.. మరణాల సంఖ్య 60,472కి పెరిగింది. Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు
ప్రస్తుతం దేశంలో 7,25,991 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 25,23,772 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. నిన్న 9,24,998 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆగస్టు 26 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,85,76,510 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. Also read: Covid-19: మాల్లో రోబో ‘జాఫిరా’ సేవలు.. ఇట్టే స్కాన్ చేస్తుంది