Ratan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు, ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా

Ratan Tata Died: భారతదేశ ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా కంపెనీ అధినేత రతన్ టాటా ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణంతో దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2024, 12:37 AM IST
Ratan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు, ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా

Ratan Tata Died: దేశంలో పారిశ్రామిక దిగ్గజం ఇక లేరు. స్వాతంత్ర్యం పూర్వం నుంచి దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థగా ఉన్న టాటా కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా 86 వయస్సులో తుది శ్వాస విడిచారు. వృద్ధాఫ్య సమస్యలతో ముంబైలోని ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా మరణవార్తను ధృవీకరించారు. రతన్ టాటా మరణంతో కేవలం పారిశ్రామిక రంగమే కాదు..దేశమంతా ఆవేదనకు గురైంది. హర్ష గోయెంకా ట్వీట్ చూస్తేనే రతన్ టాటా గొప్పతనం ఏంటో అర్ధమౌతుంది. గడియారం చప్పుడు ఆగిపోయింది. టైటాన్ చనిపోయింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి వెలుగుగా ఎదిగారు. వ్యాపారంలో, బయటి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు అంటూ హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. 

అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం రతన్ టాటా మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళులర్పించారు. రతన్ టాటాకు దేశంతో, దేశాభివృద్ధితో ఉన్న సంబంధంతో తన మది నిండిపోయిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ కలుసుకుని సలహాలు సూచనలు తీసుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. మరోవైపు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రతన్ టాటా మరణం పట్ల సంతాపం తెలిపారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో రతన్ టాటా పాత్రను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఆయన కుటుంబానికి తన సానుభూతి ప్రకటించారు. 

1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించిన రతన్ టాటా 86 ఏళ్ల వయస్సులో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. రతన్ టాటా పూర్తి పేరు రతన్ నవల్ టాటా. 1990 నుంచి 2012 వరకూ టాటా సన్స్ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తరువాత 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకూ టాటా గ్రూప్‌కు ఇంటెరిమ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం టాటా ఛారిటబుల్ ట్రస్తులకు అధిపతిగా కొనసాగుతున్నారు. 

Also read: Bank Holidays 2024: ఆ 5 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News