India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు.. 600లకు తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 11కోట్లు దాటింది. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులకన్నా రికవరీ రేటు నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 91.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.49 శాతం, యాక్టివ్ కేసుల రేటు 6.83 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో ఆదివారం ( నవంబరు 1న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 45,230 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 496 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,29,313కి పెరగగా.. మరణాల సంఖ్య 1,22,607 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Tedros Adhanom Ghebreyesus: క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
అయితే.. ఆదివారం కరోనాతో 53,285 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 75,44,798 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,61,908 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. Also read: Pawan Kalyan Movie Shooting: రంగంలోకి దిగిన వకీల్ సాబ్
అయితే ఆదివారం దేశవ్యాప్తంగా 8,55,800 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 1 వరకు మొత్తం 11,07,43,103 నమూనాలను దేశంలో పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.
Also read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe