India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రికవరీ రేటు నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది. Also read: LRS last date In Telangana: నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువు
గత 24 గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 30న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 48,268 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 551 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119 కి చేరగా.. మరణాల సంఖ్య 1,21,641కి పెరిగింది. గురువారం కరోనాతో 59,454 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 74,32,829 కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,82,649 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. Also read: Turkey Earthquake: 17కి చేరిన మృతుల సంఖ్య.. వందలాది మందికి గాయాలు
ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 91.34 శాతం ఉండగా.. మరణాల రేటు 1.49 శాతం, యాక్టివ్ కేసుల రేటు 7.16 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. అయితే శుక్రవారం దేశవ్యాప్తంగా 10,67,976 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 29 వరకు మొత్తం 10,87,96,064 నమూనాలను దేశంలో పరీక్షించారు.
Also read: Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe