portable device for corona tests: ఢిల్లీ: దేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ( IIT Kharagpur ).. కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షలు జరిపేందుకు అతితక్కువ ఖర్చుతో కొత్త పరికరాన్ని అభివృద్ది చేసింది. పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ అనే పరికరంతో కేవలం 400 రూపాయల ఖర్చుతో గంటలోనే ఫలితం తేలిపోతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ ఆచార్యుల బృందం వెల్లడించింది. Also read: Unlock 3.0: 27న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
అయితే ఈ కోవిడ్ పోర్టబుల్ ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను ఐఐటీ ఛాన్స్‌లర్ తివారి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెకానికల్ ఇంజినీరింగ్, బయోసైన్స్ విభాగాలకు చెందిన ప్రొఫేసర్ల బృందం దీనిని రూపొందించిందని తెలిపారు. ఈ కిట్ ధర కేవలం నాలుగు వందల లోపే ఉంటుందని, గంటలోనే ఫలితం కూడా అందిస్తుందని ఆయన వివరించారు.
దీనిద్వారా చాలా మందికి కరోనా పరీక్షలు చేయవచ్చని ప్రొఫెసర్ల బృందం వెల్లడించింది. ప్రతీ టెస్టు తర్వాత ఒక పేపర్ కాట్రిడ్జ్ మారిస్తే సరిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షల ధరలకంటే.. ఇదే అతి తక్కువ అని పేర్కొంది. Also read: Apple: భారత్‌లో ఐఫోన్ 11 ఉత్పత్తి ప్రారంభం
IIT Kharagpur: రూ.400లకే కరోనా టెస్టు..