LPG Price Cut: గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ ఫిబ్రవరి 1 నుంచి తగ్గాయి. ఆయిల్ కంపెనీలు 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు అమలు కానున్నాయి. ప్రతి గ్యాస్ సిలెండర్‌పై 7 రూపాయలు ధర తగ్గింది. ఏయే నగరాల్లో ఎంత ఉందో చెక్ చేద్దాం
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇవాళ్టి నుంచి కొద్దిగా ఉపశమనం కలగనుంది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 7 రూపాయలు తగ్గింది. ఆయిల్ కంపెనీలు ప్రతి నెలా 1 తేదీన గ్యాస్ సిలెండర్ ధరలపై సమీక్ష చేసి ధర తగ్గించడం లేదా పెంచడం చేస్తుంటాయి. గత కొద్దికాలంగా 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర మాత్రం క్రమంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. ఇటీవల వాణిజ్య సిలెండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు ఈసారి సిలెండర్‌పై 7 రూపాయలు తగ్గించాయి. దాంతో దేశ రాజధాని ఢిల్లీలో 1804 రూపాయలుగా ఉన్న 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 1797 రూపాయలకు తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఒక్కో విధంగా ఈ తగ్గుదల ఉంది. కోల్‌కతాలో వాణిజ్య సిలెండర్ ధర 1911 రూపాయల నుంచి 1907 రూపాయలకు తగ్గింది. ముంబైలో 1756 రూపాయల నుంచి 1749.50 రూపాయలకు తగ్గింది. ఇక చెన్నైలో 1966 రూపాయల నుంచి 1959 రూపాయలైంది.
ఈ ఏడాది ప్రారంభంలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర 14-16 రూపాయలు తగ్గింది. ఇప్పుడు వరుసగా రెండోసారి తగ్గడం విశేషం. గత ఏడాది డిసెంబర్ నెలలో మాత్రం గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది. డిసెంబర్ నెలలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఢిల్లీలో 1802 రూపాయల నుంచి 1818.50 రూపాయలకు పెరిగింది. అదే కోల్‌కతాలో 1911.50 రూపాయల నుంచి 1927 రూపాయలకు పెరిగింది. ఇక ముంబైలో 1754.50 రూపాయల నుంచి 1771 రూపాయలైంది. చెన్నైలో 1964.50 రూపాయల నుంచి 1980.50 రూపాయలకు పెరిగింది.
14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర తగ్గించాలని చాలాకాలంగా వినియోగదారులు చూస్తున్నారు.
Also read: Cardamom Health Benefits: రోజూ ఇలాచీ టీ తాగితే డయాబెటిస్ సులభంగా తగ్గించవచ్చా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి