Gujarat Earthquake Latest Update: వరుస భూకంపాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భారత్‌లోనూ భారీ భూకంపాలు సంభవిస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం గుజరాత్‌తో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. భూకంప కేంద్రం రాజ్‌కోట్‌కు నార్త్ నార్త్ వెస్ట్ (NNW) 270 కి.మీ దూరంలో గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం 3.21 గంటలకు భూకంపం సంభవించింది. మరికొద్ది రోజుల్లో ఇక్కడ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత బుధవారం ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్‌లో కూడా ప్రకంపనలు మరోసారి కనిపించాయి. భూకంప కేంద్రం నేపాల్‌లో గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. అయితే ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రకంపనలు చాలా స్వల్పంగానే ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
మరోవైపు ఈ నెల 22న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో కూడా మధ్యాహ్నం 1.30 గంటలకు భూకంపం సంభవించింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లోని జుమ్లాలోని పితోరాఘర్‌కు 143 కిలోమీటర్ల దూరంలో.. భూగర్భంలో 10 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో భూకంప ప్రకంపనలు నిరంతరంగా వస్తుండడంతో ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
అంతకుముందు ఫిబ్రవరి ప్రారంభంలో కూడా భూకంపం కారణంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా భూభాగం మరోసారి వణికిపోయింది. హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. అంతకుముందు జనవరి 5న ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భూకంపం బలమైన ప్రకంపనలు సంభవించాయి. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోకముందే భారత్, చైనా, నేపాల్ వంటి దేశాల్లో వరుస భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.
Also Read: TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్
Also Read: Bandi Sanjay: కేసీఆర్ వలలో పడి మోసం చేస్తారు.. వారితో జాగ్రత్త: బండి సంజయ్ హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి