Diwali 2023: దీపావళి అంటేనే టపాసులు పండగ అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీపావళికి రెండు మూడు రోజుల ముందు నుంచే టపాసులు అంగళ్ళ సందడి మొదలవుతుంది. ఇక పిల్లల నుంచి పెద్దల వరకు వరుసగా టపాసులు పేలుస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
బాణా సంచాలు కాల్చే సమయంలో ఎప్పుడు కూడా ఒక బకెట్ నీళ్లు దగ్గరలో సిద్ధంగా పెట్టుకోవాలి. సడన్గా మంటలు వ్యాపించినప్పుడు ఆర్పడానికి మీరు ఉపయోగపడుతుంది. అలాగే సుర సుర లాంటివి కాల్చినప్పుడు కడ్డీలు బాగా ఎర్రగా మండుతూ ఉంటాయి. అటువంటి వాటిని నేలపైన ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. తడి మట్టిని ఒక బకెట్లో ఉంచుకోవాలి..ఇటువంటి వాటిని ఆ బకెట్లో వేసేస్తే సరిపోతుంది.
టపాసులు ఎప్పుడు కూడా ఇంటి లోపల కాల్చకూడదు. ఆరుబయట బాగా గాలి వెళ్తురు ఉన్న ప్రదేశంలోనే టపాసులను కాల్చాలి. టపాసులు కాల్చే సమయంలో పిల్లలకు కచ్చితంగా మాస్క్ వంటిది వేయడం మర్చిపోకండి. లేకపోతే ఆ హానికరమైన వాయువులు శరీరంలోకి ప్రవేశించి శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అవైలబుల్ లో ఉన్నాయి.. ఇది ఉపయోగిస్తే కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది.
టపాసులు కాల్చేవారు ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించాలి. అలాగే కళ్ళలో ఎటువంటి దుమ్ము పడకుండా ప్రొటెక్షన్ కోసం అద్దాలు కూడా వేసుకోవాలి. పెద్దవారి సహాయం లేకుండా చిన్న పిల్లలను బాణా సంచాలను కాల్చడానికి అస్సలు ఒంటరిగా వదలకూడదు. టపాసులు కాలుస్తున్న సమయంలో కచ్చితంగా పాదరక్షకులు ధరించాలి. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీగా పెట్టుకోవాలి. టపాసులు కాల్చడం పూర్తి అయిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి