Delhi Corona Update: కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఇప్పుడు దానికి అంత వ్యతిరేకంగా ఉంది. ఢిల్లీ ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటోంది. కరోనా రహిత ఢిల్లీగా మారుతున్నట్టు కన్పిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) సృష్టించిన విపత్కర పరిస్థితులు దేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ముఖ్యంగా రాజధాని నగరం ఢిల్లీలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి. ఓ దశలో ఢిల్లీ వణికిపోయింది. కరోనా పరిస్థితులతో ప్రజలు విలవిల్లాడారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణకై ఢల్లీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో వస్తున్నాయి. ఢిల్లీ నగరం కరోనా రహితంవైపుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గత 24 గంటల్లో ఢిల్లీలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పదులకు పరిమితమైంది. కరోనా పాజిటివిటీ రేటు సున్నాకు చేరింది.
గత 24 గంటల్లో ఢిల్లీలో కేవలం 35 కరోనా పాజిటివ్ కేసులో నమోదయ్యాయి. అటు కోవిడ్ కారణంగా ఒక్కరు కూడా మరణించలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తరువాత అతి తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అటు మరణాలు లేకపోవడం కూడా ఇదే. పాజిటివిటీ రేటు ఏకంగా 0.05 శాతం మాత్రమే. అటు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)కూడా గత 24 గంటల్లో పెద్ద సంఖ్యలో అంటే 74 వేల 540 మందికి చేశారు. ఢిల్లీలో ఇప్పటి వరకూ 14.12 లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మాత్రం కరోనా కేసులు ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. రోజుకు 35 వేలకు చేరువలో అటూ ఇటూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Also read: Vijay Roopani Resigned: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook