Farmers Protest Update: దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో అట్టుడికిపోతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ సిమెంట్ దిమ్మలు, బారికెడ్లు, మేకులతో తయారు చేసిన కర్రలను సిద్ధం చేసుకుంటున్నారు. పంజాబ్, హర్యానాలోని బార్డర్ శంభు వద్ద నిరసన ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.
Read More: Vankaya Bajji Recipe: వంకాయ బజ్జీలు అంటే ఇష్టమా.. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోండి!
పంటలకు కనీస మద్దతు ధర, గతంలో రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్లతో రైతులు నిరసలను ప్రారంభించారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు, ట్రాఫిక్ నియమాల వల్ల సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అనేక ప్రాంతాల నుంచి రైతులు, ట్రాక్టర్లు, లారీల మీద పెద్దత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల సహాయంతో పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్వర్వ్ చేస్తున్నారు. మరికొన్ని పోలీసు ఫ్లాటూన్లను ఢిల్లీకి రప్పిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో నిరసన కారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు వాటర్ ట్యాంకర్ లను ఉపయోగిస్తున్నారు. తాజాగా... ఇప్పుడు అమెరికా లోని ఎల్ఆర్ఏడీ ఆయుధం ను వాడటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీర్ఘశ్రేణి ధ్వని ఆయుధం అనే దాన్ని ఉపయోగించి రైతులను పారిపోయేట్లు చేయడం పోలీసులు ప్లాన్.
Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..
ఈ పరికరం నుంచి చెవులు భరించలేని శబ్దం వెలువడుతుంది. అంతే కాక చెవిల్లోని కర్ణబేరి పగిలి రక్తం కూడా బైటకు వస్తుందంట. అల్లరి మూకడను అరికట్టేందుకు ఇలా చేస్తున్నారని సమాచారం. ఈ పరికరాన్ని 2000 సంవత్సరంలో వీటిని అమెరికా తయారు చేసింది. 2013 లో ఢిల్లీ పోలీసులు దీన్ని సమకూర్చుకున్నారు. దీని కోసం 30 లక్షలు వెచ్చించినట్లు తెలుస్తొంది. అదేవిధంగా 5 పరికరాలను ఢిల్లీ పోలీసులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook