Covid-19 Cases updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి నిత్యం 70వేలకు చేరువలో కరోనా కేసులు, దాదాపు వేయి మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. గత 24 గంటల్లో ( శుక్రవారం) కొత్తగా 69,878 కరోనా కేసులు నమోదు కాగా.. నిన్న ఈ మహమ్మారి కారణంగా 945 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health Ministry ) శనివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,75,701కి చేరింది. దీంతోపాటు మరణాల సంఖ్య 55,794కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,97,330 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 22,22,577 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్
ఒకేరోజు మిలియన్ టెస్టులు..
ఇదిలాఉంటే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఆగస్టు చివరి నాటి కల్లా ఒకేరోజులో 10లక్షల టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దానిని అనతి కాలంలోనే అధిగమించింది. ఆగస్టు 21న దేశవ్యాప్తంగా 10,23,836 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో ఆగస్టు 21వరకు 3,44,91,073
నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. Also read: NCERT Books: అక్రమ దందా.. రూ.35కోట్ల పుస్తకాల సీజ్
India: ఒకేరోజు మిలియన్ టెస్టులు.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు