Corona JN.1 Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భయపెడుతోంది. జేఎన్ 1గా పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ కేసులు కేరళలో బయటపడటమే కాకుండా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంంది. కొత్త వేరియంట్ పట్ల రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రం తెలంగాణలో సైతం కొత్తగా 4 కేసులు వెలుగు చూశాయి. నిన్న 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 9 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. అయితే వీరిలో ఎంతమందికి కొత్త వేరియంట్ ఉందనేది ఇంకా తేలాల్సి ఉంది. అటు కేరళలో కొత్త వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 115 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1749కు చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 142 కేసులు నమోదు కాగా అందులో 115 కేరళ నుంచే కావడం గమనార్హం.
కేరళలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ జేఎన్ 1 ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో విస్తరిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం సింగపూర్‌లో ఈ వేరియంట్ చాలా ఉధృతంగా ఉంది. కేవలం వారం రోజుల వ్యవధిలో 56 వేల కేసులు నమోదయ్యాయి. దాంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. కేసుల సంఖ్య ఇంకా పెరిగితే లాక్‌డౌన్ విధిస్తామని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు మలేషియాలో కూడా 20 వేల కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ అంత వేగంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే చలికాలం కావడంతో నియంత్రణ కష్టం కావచ్చంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికి సైతం కరోనా కొత్త వేరియంట్ సోకుతోందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు కన్పిస్తున్నాయని గుర్తించారు. ఇది ఎంతవరకూ ప్రమాదకరమైందనేది నిర్ధారించేందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.
ప్రస్తుతం క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇలా పండుగల సీజన్ కావడంతో కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని ఆదేశించింది. ఎందుకంటే కొత్త వేరియంట్ ఆర్టీపీసీఆర్ పరీక్షలతో తెలుస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also read: Tamilnadu Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు, రంగంలో దిగిన వైమానిక బృందాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook