Corona Updates in India: భారత్‌లో కోవిడ్ విజృంభిస్తోంది. గత కొంతకాలంగా 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ 21 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 5 లక్షల 7 వేల 360 మందికి కరోనా పరీక్షలు చేయగా 21 వేల 566 కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇటు రికవరీ రేటు కూడా పెరుగుతోంది.
తాజాగా 18 వేల 294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4.31 కోట్ల మంది బాధితులు వైరస్‌ను జయించారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు కలవర పెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్షా 48 వేల 881గా ఉంది. క్రియా శీల కేసుల రేటు 0.34 శాతంగా ఉంది. కరోనా వల్ల కొత్తగా 45 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5.25 లక్షలుగా ఉంది.
ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కొత్తగా 29.12 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు 200.91 కోట్ల మందికి టీకా పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నారు. రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు అందిస్తున్నారు.
#COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours.
Active cases 1,48,881
Daily positivity rate 4.25%— ANI (@ANI) July 21, 2022
Also read:Telangana Rains Update: తెలంగాణలో మళ్లీ వర్షాలు... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం..
Also read:GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook