Rahul Gandhi Twit: ఉద్యోగుల భవిష్య నిధి(EPF) డిపాజిట్లపై వడ్డీని 8.1 శాతానికి తగ్గించారు. దీనికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మోదీ సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇంటికి లోక్ కళ్యాణ్ మార్గ్ పెట్టుకున్నంత మాత్రాన ప్రజలకు సంక్షేమం దక్కదన్నారు. ట్విట్టర్ వేదికగా కేంద్రం,మోదీపై విరుచుకుపడ్డారు.
దాదాపు ఆరున్నర కోట్ల మంది ఉద్యోగుల జీవితాలను నాశనం చేసేందుకు ధరల పెంపు..ఆదాయం తగ్గింపు మోడల్‌ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ వడ్డీ రేట్ల తగ్గింపు సూచీకలను ఈసందర్భంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం లోక్ కళ్యాణ్ మార్గ్ అని పిలిచే ప్రాంతాన్ని గతంలో 7 రేస్ కోర్స్ రోడ్ పిలిచేవారని..2016లో దానిని లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చారని గుర్తు చేశారు.
తాజాగా ఇదే పేరును రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2015-16లో ఈపీఎఫ్ వడ్డీ 8.80గా ఉండేదని..ఇప్పుడు దానిని 8.1కు తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటివరకు పీఎఫ్‌పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు అని అన్నారు. గతంలో 1977-78లో కేవలం 8 శాతం వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తెలియజేశారు.
घर का पता 'लोक कल्याण मार्ग' रख लेने से लोगों का कल्याण नहीं होता।
प्रधानमंत्री ने साढ़े 6 करोड़ कर्मचारियों के वर्तमान और उनके भविष्य को बर्बाद करने के लिए 'महंगाई बढ़ाओ, कमाई घटाओ' मॉडल को लागू किया है। pic.twitter.com/lr1prlOZEa
— Rahul Gandhi (@RahulGandhi) June 4, 2022
Also read:Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..తప్పకుండా ఈ సూచనలను పాటించండి..!!
Also read: Sharmila Comments: తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు..టీఆర్ఎస్ సర్కార్‌పై షర్మిల ఫైర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook