చంద్రబాబు, మమతా బెనర్జీల బాటలోనే ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తమ రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టాడానికి వీల్లేదంటూ ఆ సంస్థకు ఉన్న సాధారణ అనుమతులను రద్దు చేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలనం సృష్టించగా ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అదేవిధంగా సీబీఐ సంస్థకు అనుమతి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

Last Updated : Jan 11, 2019, 04:06 PM IST
చంద్రబాబు, మమతా బెనర్జీల బాటలోనే ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి

రాయ్‌పూర్: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తమ రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టాడానికి వీల్లేదంటూ ఆ సంస్థకు ఉన్న సాధారణ అనుమతులను రద్దు చేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలనం సృష్టించగా ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అదేవిధంగా సీబీఐ సంస్థకు అనుమతి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి బాటలోనే తాజాగా ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సైతం సీబీఐకి గతంలో తమ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు స్పష్టంచేశారు. ఈ మేరకు ఛత్తీస్‌ఘడ్ సర్కార్ ఓ అధికారిక లేఖ సైతం విడుదల చేసింది. డీఎస్‌పీఈ చట్టం 1946లోని సెక్షన్ 6 ప్రకారం రాష్ట్రంలో విచారణ జరిపేందుకు ఇచ్చే అనుమతిని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో వున్న మోదీ సర్కార్.. సీబీఐ, ఈడీ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని తమకు అనుకూలంగా లేని నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News