Chandrayaan 3: చంద్రునిపై పగలు ప్రారంభం, చంద్రయాన్ రీ యాక్టివేషన్ కోసం ఇస్రో విఫలయత్నాలు

Chandrayaan 3: ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ 3 విజయవంతమైన సంగతి తెలిసిందే. దాదాపు 14 రోజులు నిద్రావస్థలో ఉన్న ల్యాండర్, రోవర్‌లను తిరిగి యాక్టివేట్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 22, 2023, 08:59 PM IST
Chandrayaan 3: చంద్రునిపై పగలు ప్రారంభం, చంద్రయాన్ రీ యాక్టివేషన్ కోసం ఇస్రో విఫలయత్నాలు

Chandrayaan 3: చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా కాలుమోపిన చంద్రయాన్ 3 చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23 నుంచి 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేసిన ల్యాండర్, రోవర్‌లు చంద్రునిపై చీకటి పడటంతో నిద్రావస్థలో వెళ్లిపోయాయి. ఇప్పుడు ఉదయం కావడంతో తిరిగి వేకప్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

చంద్రయాన్ 3 విజయవంతంతో ల్యాండర్ విక్రమ్, ప్రగ్యాన్ రోవర్‌లు 14 రోజులు పనిచేసిన తరువాత చంద్రునిపై రాత్రి అవడంతో నిద్రావస్థలో వెళ్లాయి. చంద్రునిపై పగలు, రాత్రి చెరో 14 రోజులుంటుంది. 14 రోజులపాటు వివిధ రకాల చిత్రాల్ని పంపించిన ల్యాండర్, రోవర్‌లు 14 రోజుల్నించి నిద్రావస్థలో ఉన్నాయి. తిరిగి ఇవాళ అంటే సెప్టెంబర్ 22న చంద్రునిపై పగలు ప్రారంభం కావడంతో..సూర్యరశ్మి అందుతోంది. ఈ క్రమంలో నిద్రావస్థలో ఉన్న ల్యాండర్, రోవర్‌లను మేల్కొల్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి ఇస్రోకు ఎలాంటి సంకేతాలు అందడం లేదు. 

చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 దిగిన ప్రాంతంలో సూర్యోదయమైందని, బ్యాటరీ రీఛార్జ్ ఎప్పుడౌతుందా అని ఎదురు చూస్తున్నట్టు ఇస్రో తెలిపింది. ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేసేందుకు అవసరమైన వేడిని అందించే సూర్యోదయం కావాలని ఇస్రో భావిస్తోంది.

ఇదే విషయాన్ని ఇస్రో ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఇప్పటి వరకూ ల్యాండర్, రోవర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదని తెలిపింది. ల్యాండర్, రోవర్‌లతో తిరిగి కమ్యూనికేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇస్రో వెల్లడించింది. 

Also read: AP Rains Alert: ఏపీలో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News