UPS vs NPS Benefits: దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు ఎన్‌పీఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్ధం కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తోంది. ఈ కొత్త పెన్షన్ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది ఉద్యోగులకు ఏ మేరకు లాభదాయకమూ చూద్దాం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఈ విధానం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే డీఏ పెంపు ప్రకటనకు ముందే 50 శాతం అవుతుంది. ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు ఈ ప్రయోజనం లభించనుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఈ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నెల దాటేసింది. జనవరి 24వ తేదీన ఈ పధకాన్ని ప్రకటించాక కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్ ఏది కావాలో ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జీతంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. కానీ యూపీఎస్ విధానంలో నిర్దిష్ట మొత్తం పెన్షన్ ఉంటుంది. ఇది గత ఏడాది ప్రాధమిక వేతనంలో సగం ఉంటుంది. అయితే ఉద్యోగి సర్వీసు కనీసం 25 ఏళ్లు పూర్తయి ఉండాలి. ఒకవేళ దురదృష్ఠవశాత్తూ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి నిర్దిష్ట మొత్తం పెన్షన్ లభిస్తుంది. ఇది ఉద్యోగి పెన్షన్‌లో 60 శాతం ఉండవచ్చు
అదే విధంగా కనీస పెన్షన్ కూడా వర్తిస్తుంది. ఎవరైనా ఉద్యోగి పదేళ్లు పనిచేస్తే కనీస పెన్షన్ 10 వేల అందుతుంది. అయితే, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఓల్డ్ పెన్షన్ విధానమే కావాలని కోరుకుంటున్నాయి.
Also read: Jio Special Plans: జియో యూజర్లకు గుడ్‌న్యూస్, ఆ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ పూర్తిగా ఫ్రీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి