Toll Pass System: దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. తరచూ లేదా అత్యధిక ప్రయాణాలు చేసేవారికి ఇది లాభదాయకం. నెల, వార్షికం, లైఫ్‌టైమ్ పాస్ తీసుకురానుంది. ఈ పాస్‌లు తీసుకుంటే నిర్ణీత వ్యవధిలో ఎన్నిసార్లయినా, ఎలాంటి అదనపు టోల్ చెల్లించకుండా అన్ని జాతీయ రహదారుల్లో ప్రయాణాలు చేయవచ్చు.
అంటే ఈ కొత్త టోల్ పాస్‌లు అమల్లోకి వస్తే అన్‌లిమిటెడ్ వినియోగం ఉంటుంది. ఇది అప్పుడప్పుడూ కాకుండా తరచూ నేషనల్ హైవేస్ పై ప్రయాణాలు చేసేవారికి ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు ప్రయోజనంగా ఉంటుంది. ఈ టోల్ పాస్‌లు రెండు కేటగిరీల్లో ఉంటాయి. ఒకటి వార్షిక పాస్. దీనికి 3 వేల రూపాయలు చెల్లించాలి. రెండవది లైఫ్‌టైమ్ అంటే 15 ఏళ్లు. 30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు పాస్‌లు తీసుకుంటే నిర్ణీత వ్యవధి కాలంలో ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లయినా ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండా తిరగవచ్చు. ప్రస్తుతం ఏదైనా టోల్ ప్లాజాకు సమీపంలో ఉండే గ్రామస్థుల కోసం నెలకు 340 రూపాయలు అంటే ఏడాదికి 4080 రూపాయలకు పాస్ అందిస్తోంది. అది కూడా ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇస్తే. ఈ పాస్ ఆ ఒక్క టోల్ ప్లాజాకే వర్తిస్తుంది.
అదే ఈ కొత్త విధానంలో అయితే ఏడాదికి 3 వేలు మాత్రమే ఖర్చవుతాయి. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌కే ఈ లైఫ్‌టైమ్ లేదా వార్షిక పాస్ లు అనుసంధానం చేస్తారు. కొత్తగా పాస్‌లు జారీ చేయాల్సిన ప్రక్రియ ఉండదు. ప్రైవేట్ కార్లకు వార్షిక, లైఫ్‌టైమ్ టోల్ పాస్ జారీ చేయడం ద్వారా రాబడిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.
ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాధమిక దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే అమల్లోకి వస్తుంది.
Also read: School Girl Gang Rape: టీచర్లు కాదు..కీచకులు, విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి