PF Fixed Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని గుడ్‌న్యూస్. ఇకపై ఫిక్స్డ్ వడ్డీ, లాభమేంటో తెలుసా

PF Fixed Interest Rate in Telugu: పీఎఫ్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఆనందించే బిగ్ అప్‌డేట్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 18, 2025, 05:46 PM IST
PF Fixed Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని గుడ్‌న్యూస్. ఇకపై ఫిక్స్డ్ వడ్డీ, లాభమేంటో తెలుసా

PF Fixed Interest Rate in Telugu: కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త ఇది. ఇకపై వడ్డీ రేట్లు తగ్గడం, పెరగడం ఉండదు. పీఎఫ్ డబ్బులకు నిర్ధారిత వడ్డీ లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఇది కచ్చితంగా లాభించే అంశం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు లబ్ది ఎలా కలుగుతుందో చూద్దాం.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓ సంస్థకు దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ వేతన జీవులు ఉంటారు. పీఎఫ్ ఖాతాల్లోని డబ్బులపై ఏడాదికోసారి వడ్డీ కలుపుతుంటారు. ఈ వడ్డీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంటుంది. ఒక్కోసారి తగ్గడం లేదా పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇలా కాకుండా ఎప్పుడూ ఒకే వడ్డీ రేటు ఉండేలా ఆలోచన చేస్తోంది. దీనికోసం రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల పీఎఫ్‌పై ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ అందుతుంది. హెచ్చుతగ్గులు ఉండవు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. 

వాస్తవానికి ఈపీఎఫ్ఓ నుంచి ఫీఎఫ్ ఫండ్‌లో కొంత భాగం మార్కెట్‌లో ఇన్వెస్ట్ అవుతుంది. కానీ దీనిపై చాలా సందర్భాల్లో రిటర్న్ తక్కువగా లభిస్తుంటుంది. దాంతో ఆ ప్రభావం పీఎఫ్ ఖాతాదారులపై పడుతుంది. షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు దాని ప్రభావం పీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లాభంపై పడుతుంది. తక్కువ రిటర్న్ లభించినప్పుడు వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిస్థితి లేకుండా ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ ఉండేలా ఒక రిజర్వ్ ఫండ్ కోసం ఆలోచన జరుగుతోంది. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులకు షేర్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం ఉండదు. ఎప్పుడూ ఒకే వడ్డీ అందుతుంది. ప్రతి ఏటా వచ్చే వడ్డీ నుంచి కొంతభాగం రిజర్వ్ ఫండ్ కింద వేరు చేస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు రిటర్న్ తక్కువగా లభిస్తే ఈ ఫండ్ నుంచి స్థిరీకరిస్తారు. అంటే పీఎఫ్ ఖాతాదారునికి ఎప్పుడూ నష్టం ఉండదు. 

అయితే ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో 4 నెలల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం పీఎఫ్‌పై వడ్డీ 8.25 శాతం అందుతోంది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రారంభంలో అంటే 1952-53లో ఇది కేవలం 3 శాతం ఉంది. మధ్యలో 1989-90లో వడ్డీ రేటు 12 శాతం వరకు పెరిగింది. ఆ తరువాత మళ్లీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25 పీఎఫ్ వడ్డీ రేటు ఇంకా నిర్ధారణ కాలేదు. 

Also read: Ys Jagan Strong Warning: ఎవరు ఎక్కడున్నా బట్టలూడి కొడతాం...వైఎస్ జగన్ విశ్వరూపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News