CBSE Admit Cards 2025 Out: సీబీఎస్ఈ 10,12 బోర్డు పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

CBSE Admit Cards 2025 Out: సీబీఎస్ఈ విద్యార్ధులకు కీలకమైన అప్‌డేట్. పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 4, 2025, 12:09 PM IST
CBSE Admit Cards 2025 Out: సీబీఎస్ఈ 10,12 బోర్డు పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

CBSE Admit Cards 2025 Out: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024-25 విద్య సంవత్సరంలో 10,12 తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఒక్క క్లిక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మూడు నెలల క్రితం పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పడు విద్యార్ధులు తమ తమ హాల్ టికెట్లను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.in సందర్శించి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డుల్ని పొందవచ్చు. సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 8 వరకూ జరగనున్నాయి. ఇక 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి.

ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.in ఓపెన్ చేయాలి. కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే స్కూల్ ఎంపిక కన్పిస్తుంది. అది క్లిక్ చేశాక ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీస్ నుంచి అడ్మిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. లాగిన్ వివరాలు ఎంటర్ చేస్తే మీ అడ్మిట్ కార్డులు స్క్రీన్‌పై వస్తాయి. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. 

సీబీఎస్ఈ పరీక్షలకు ఏవి అనుమతిస్తారు, ఏవి అనుమతించరు

మొబైల్ ఫోన్లు, బ్లూ టూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్,హెల్త్ బ్యాండ్, స్మార్ట్‌వాచ్, కెమేరా, పెన్ డ్రైవ్, లాగ్ టేబుల్, కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్, వాలెట్, గూగుల్స్, హ్యాండ్ బ్యాగ్ లేదా పౌచ్ అనుమతించరు. అనలాగ్ వాచ్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్, మెట్రో కార్డు, బస్ పాస్, డబ్బులు మాత్రమే అనుమతిస్తారు. 

Also read: Champions Trophy 2025 India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా తుది జట్టు ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News