Pandit Vishnu rajoria comments on brahmin couple childrens: కొంత మంది రాజకీయ నేతలు ఇటీవల మహిళల సంతానం పట్ల వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఒకర్ని కనాలని ఒకరు.. మరికొందరు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్నికనాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సాధారణంగా వ్యాఖ్యలు చేసిన కూడా అది వివాదస్పదంగా మారుతున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో పరుశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా మాట్లాడిన మాటలు తెగ రచ్చగా మారాయి.. ముఖ్యంగా ఆయన ఇటీవల బ్రాహ్మాణ జనాభా భారీగా తగ్గిపోయిందని ఆందోలన వ్యక్తం చేశారు. అంతేకాకుండా... యువ బ్రాహ్మాణులకు ఈ క్రమంలో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవరైతే.. నలుగురు పిల్లలు లేదా అంతకన్న ఎక్కువ మందిని కంటారో.. వారికి రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
అయితే.. పరుశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా మధ్య ప్రదేశ్ లో.. రాష్ట్ర క్యాబినెట్ హోదాలో ఉన్నారు. అయితే.. ఆయన తాజాగా.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బ్రాహ్మాణుల జనాభా తగ్గిపోతుందని.. అందుకే ప్రతి యువ జంట కనీసం నలుగురు పిల్లల్ని కనాలని సూచించారు.
Read more: Viral Video: కుంభమేళలో షాకింగ్ ఘటన.. యూబ్యూబర్‌ను పొట్టు పొట్టు కొట్టిన అఘోరీ బాబా.. వీడియో వైరల్..
నలుగురు పిల్లలను కన్న.. బ్రాహ్మణ జంటకు పరుశురామ్ కళ్యాణ్ బోర్డు రూ.లక్ష బహుమతి ఇస్తుందని రజోరియా చెప్పారు. బోర్డు అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ నగదు పురస్కారం ఇస్తారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో..యువత పెరిగిపోతున్న ఖర్చుల భారంతో పిల్లల్ని కనడం ఆపొద్దని అన్నారు. ఇలా చేస్తే.. దేశం నాస్తికుల చేతిలో వెళ్లి పోయి.. బ్రాహ్మాణుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter